తెలుగుదేశం పార్టీకి రేవంత్‌రెడ్డి గుడ్‌బై…

ఊహించిన‌ట్టుగానే తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ తెలంగాణ నేత రేవంత్‌రెడ్డి రాజీనామా చేశాడు. ఈ మేర‌కు ఆయ‌న శ‌నివారం పార్టీ అధ్య‌క్షుడికి లేఖ రాశాడు. పార్టీ ప్రాధ‌మిక స‌భ్య‌త్వం, ప‌ద‌వుల‌కు కూడా ఆయ‌న గుడ్‌బై చెప్పేశాడు. త‌న‌కు అధ్య‌కుడు అంటే ఎంతో గౌర‌వం ఉంద‌నీ త‌న ఎదుగుద‌ల‌కు చంద్ర‌బాబు ఎంతో తోడ్ప‌డ్డార‌ని అన్నాడు. అయితే గ‌త కొన్ని రోజులుగా పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు త‌న‌ను బాధించాయ‌న్నాడు.

తానొక‌వైపు కెసియార్‌తో పోరాటం చేస్తుంటే మ‌రోవైపు టిఆర్ ఎస్‌తో పొత్తు ఉందంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌ని, కెసియార్‌తో స్నేహం నెర‌పుతున్నార‌ని ఆరోపించాడు. అయిన‌ప్ప‌టికీ అటువంటి నేత‌ల్ని చంద్ర‌బాబు నిలువ‌రించ‌లేక‌పోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు తెలంగాణ రాజ‌కీయాలు ఎలా ఉండాల‌నేదానిపై తెలుగుదేశం పార్టీకి స్పష్ట‌త లేద‌న్నాడు రేవంత్‌.

నిజానికి శ‌నివారం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెలుగుదేశం పార్టీ స‌మావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ నేత‌లు అంద‌రూ హాజ‌ర‌య్యారు. అలాంటి స‌మ‌యంలో అక‌స్మాత్తుగా పార్టీ అధ్య‌క్షుడికి రేవంత్ త‌న రాజీనామాను అంద‌జేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది, అయితే నాకైతే రేవంత్ లేఖ అంద‌లేదు అని చంద్ర‌బాబు అంటున్నారు. మాట్లాడ‌దాం ఉండు అని చెప్పి తాను వ‌చ్చానని అటున్నారు. ఏదేమైనా… రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్ప‌డంతో ఒక ఎపిసోడ్ ముగిసింది.
ఇప్పుడు ఎపి, తెలంగాణ నాయ‌కులు మూకుమ్మ‌డిగా క‌లిసిక‌ట్టుగా రేవంత్‌పై మొద‌లుపెట్ట‌నున్న మాట‌ల దాడులు. వాటికి రేవంత్ ప్ర‌త్యుత్త‌రాలు వ‌గైరాల‌తో మ‌రో ఎపిసోడ్ మొద‌లుకానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.