హైదరాబాద్లో GOAT మెస్సీ టూర్ ఎలాంటి అపశ్రుతులకు చోటు లేకుండ గడిచిపోయింది. మ్యాచ్ లో రేవంత్ రెడ్డి టీమ్ విజయం సాధించింది. మెస్సీ టీమ్ పై షూటౌట్ లో రేవంత్ ఆటగాళ్లు ఓ గోల్ ఎక్కువ కొట్టారు.దాంతో గెలుపు ఖాయమయింది. మ్యాచ్ అయిన తర్వాత మెస్సీ.. రేవంత్ టీమ్ ఆటగాళ్లకు ట్రోఫీ ప్రధానం చేశారు. రాహుల్, రేవంత్ కు .. తన పేరుతో ఉన్న టీ షర్టులను ఇచ్చారు.
ఉదయం కోల్ కతాలో మ్యాచ్ జరగలేదు. చారిటీ కార్యక్రమాలు కూడా జరగలేదు. రాజకీయ నేతలు సెల్ఫీల కోసం ఎగబడటంతో ఆ ప్రోగ్రాం గందరగోళంగా మారింది. ఆ అనుభవంతో పోలీసులు, నిర్వాహకులు వెంటనే అలర్ట్ అయ్యారు. అంతా పద్దతి ప్రకారం జరిగిపోయేలా చూశారు. స్టేడియం వద్ద కూడా గందరగోళం లేకుండా చూశారు. మ్యాచ్ ఎంత సేపు ఉంటుంది..ప్రోగ్రాం ఏమిటి అన్నదానిపై స్పష్టమైన సమాచారం ముందుగానే ఇచ్చారు. చారిటీలో భాగంగా పిల్లలు, మహిళల టీములకు నాలుగైదు నిమిషాల సేపు మెలకువలు నేర్పారు.
రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం మొత్తంలో యాక్టివ్ గా పాల్గొన్నారు. హోటల్ లో స్వాగతం చెప్పారు. ఆ తర్వాత స్టేడియంలో ఆటగాడిగా మారిపోయారు. రాహుల్ గాంధీ ప్లేయర్ గా మారలేదు కానీ ఆయన కూడా యాక్టివ్ గా ఉన్నారు. ప్రేక్షకులు కూడా మ్యాచ్ ను ఆస్వాదించారు. మొత్తంగా మెస్సీ టూర్ హైదరాబాద్ .. ఫుట్ బాల్ ప్లేయర్లకు ఓ డ్రీమ్ రన్ గా నడిచిపోయిందని అనుకోవచ్చు.
