భూముల అమ్మకాల్లో స్కాంపై సీబీఐకి రేవంత్ ఫిర్యాదు !

కోకాపేట, ఖానామెట్ గ్రామాల్లో ప్రభుత్వం వేలం వేసిన భూములన్నీ మైహోం, వాటి అనుబంధ సంస్థలు, టీఆర్ఎస్‌ నేతలకు అత్యంత సన్నిహితంగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు కొనుగోలు చేయడంపై రేవంత్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన తరవాత సీబీఐ డైరక్టర్‌ను నేరుగా కలిసి భూముల అమ్మకాలపై విచారణ జరపాలని విజ్ఞప్తి పత్రం ఇచ్చారు. రూ. వెయ్యి కోట్ల స్కాం జరిగిందన్న ఆధారాలు కూడా ఇచ్చానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

భూముల స్కాంలో ప్రధానంగా మై హోం రామేశ్వర్రావుతో పాటుగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, సీనియర్ ఐఏఎస్లు జయేశ్ రంజన్, అర్వింద్ కుమారులు ఉన్నారని రేవంత్ అంటున్నారు. సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న రాజ్పుష్ప కంపెనీ పేరుతోనూ తక్కువకు భూములు కొనుగోలు చేశారని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా రేవంత్ స్పష్టం చేశారు. రూ.3 వేల కోట్లు రావాల్సిన భూములను, రూ.2 వేల కోట్లకే పరిమితం చేశారని సీబీఐకి ఇచ్చిన లేఖలో వివరించారు. ఎకరం రూ. 60 కోట్లకు అమ్మిన భూమి తప్ప మిగతా భూమికంతా మళ్ళీ టెండర్లు పిలవాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసినంత మాత్రాన.. ఒక వేళ పక్కా ఆధారాలు ఉన్నా దర్యాప్తు చేయడానికి సీబీఐకి అధికారం లేదు. కోర్టులైనా ఆదేశించాలి లేకపోతే తెలంగాణ ప్రభుత్వమే సిఫార్సు చేయాలి. ఆ రెండు జరిగే పరిస్థితి లేదు. అందుకే బీజేపీ నేతలను రేవంత్ ఇన్వాల్వ్ చేస్తున్నారు. బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎప్పుడూ కేసీఆర్ అవినీతి గురించి ప్రశ్నిస్తారు కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయరని.. వారు వారు ఒకేటనని విమర్శించారు. బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటే మోడీ,అమిత్ షాలతో చెప్పి అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ఐఏఎస్ అధికారులపై సీబీఐ విచారణ.. అలాగే భూముల వేలం నిర్వహించిన సంస్థపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close