మీరు చేసిందేగా అంటున్నారు కేటీఆరూ !

ప్రజల పవర్.. పవర్‌లో ఉన్న పాలకుల కంటే పవర్ ఫుల్ అని కేటీఆర్ అంటున్నారు. తన పార్టీ నుంచి వరుసగా వెళ్లిపోతున్నఅత్యంత నమ్మకమైన నేతల గురించి ఆయన ఈ ట్వీట్ చేశారు. నిజానికి ఆయన బాధితుడు అయితే సానుభూతి వచ్చేది. స్వార్థపూరితమైన నేతల్ని ప్రోత్సహించారని ఇప్పుడు వారంతా మోసం చేస్తున్నారని అనుకునేవారు. కానీ కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్‌కు అలాంటి సానుభూతి రావడం లేదు. మీరు చేసిందేగా… రివర్స్ లో కౌంటర్లు వస్తున్నాయి.

కాంగ్రెస్ ఎల్పీల్ని కేసీఆర్ ఒక సారి కాదు.. రెండు సార్లు విలీనం చేసుకున్నారు. మొదటి సారి పార్టీ కాస్త బలహీనంగా ఉందన్న అభిప్రాయం కల్పించి… అన్ని పార్టీల ఎమ్మెల్యేల్ని చేర్చుకున్నారు. రెండో సారి అవసరం లేకపోయినా చేర్చుకున్నారు. అందు కోసం అన్ని రకాల టాక్టిక్స్ ప్రయోగించారు. చివరికి ఏ పార్టీని నిర్వీర్యం చేయలేకపోయారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేకపోయారు. టీడీపీని మాత్రం నిర్వీర్యం చేయగలిగారు. ఇప్పుడు ఆ పరిస్థితి బీఆర్ఎస్‌కు వస్తోంది.

పార్టీ డిఫెక్షన్స్ పై ప్రజల్లో కూడా విరక్తి వచ్చేసింది. బీఆర్ఎస్‌కు అండగా ఉండటానికి.. వారికి మద్దతుగా ఉండేందుకు కూడా ప్రజల్లో ఆసక్తి కనిపించడం లేదు. గతంలో బీఆర్ఎస్ చేససినప్పుడు మౌనంగా ఉండి.. ఇప్పుడు ఆ పార్టీ నేతలు వెళ్లిపోతూంటే… మాట్లాడితే… మంచిపద్దతి కాదనుకుని సైలెంట్ గా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది కేటీఆర్, కేసీఆరే.

అందుకే అంటారు రాజకీయాలు రోలర్ కోస్టర్ రైడ్… అధికారం ఉందని ఇవాళ విర్రవీగితే.. రేపు అదే వారికీ జరుగుతుంది. అప్పుడు ఇదన్యాయం అని ఏడ్చే అవకాశం కూడా ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ ఉద్యోగ సంఘం నేతలు ఎక్కడ ?

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వాయిస్ లేకుండా చేసింది. ఉద్యోగ సంఘం నేతల్ని ఉద్యోగుల వాయిస్ కాకుండా తమ వాయిస్ వినిపించేలా చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారికి నోరు పెగలడం...

తననూ లెక్కేసుకోవాలంటున్న రమణదీక్షితులు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి రమణదీక్షితులుఓ విన్నపం చేశారు. సోషల్ మీడియాలో ఈ విన్నపం చేసుకున్నారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ లిస్టవుట్ చేసుకుని తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. ఆ...

ఫ్లాష్ బ్యాక్‌: జ‌మున‌ని ఎందుకు బ్యాన్ చేశారు?

కొన్నేళ్ల క్రితం ప్ర‌కాష్‌రాజ్‌ని 'మా' అసోసియేష‌న్ బ్యాన్ చేసిన సంగ‌తి ఇప్ప‌టికీ ఏదో ఓ సంద‌ర్భంలో త‌ల‌చుకొంటుంటాం. ఆ త‌ర‌వాత ఏ న‌టుడ్నీ అలా బ్యాన్ చేయ‌లేదు. కానీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే......

టీడీపీ క్యాడర్‌పై కేసుల ఎత్తివేత !

జగన్ రెడ్డి జమానాలో ఎఫ్ఐఆర్‌ల విప్లవం నడిచింది. నిజమైన రౌడీలు, ఖునీకోరులు హాయిగా తిరుగుతూంటే... టీడీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాపోస్టులు పెట్టినా వేధింపులు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. టీడీపీ అధికారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close