పీవీపీ ట్వీటు… రివ‌ర్స్ కౌంట‌ర్లు

చాలా కాలం నుంచి సోదిలో లేకుండా పోయాడు నిర్మాత పివీపీ (ప్ర‌సాద్ వి.పొట్లూరి). ఇప్పుడు ఓ ట్వీట్ తో హాట్ టాపిక్ గా మారాడు. ”రియ‌ల్ హీరో బాబు… రీల్ హీరో కాదు.. లంగా డాన్సులేసే స్టార్ల‌కు 50 కోట్లు, ఈ రియ‌ల్ హీరోకి జావా బైక్‌.. హ‌త‌విధీ” అంటూ ట్వీట్ చేసి.. స్టార్ హీరోల అభిమానుల్ని హ‌ర్ట్ చేశాడు. ఓ రైల్వే ఉద్యోగి సాహ‌సంతో.. ఒక‌రి ప్రాణాలు కాపాడినందుకు… ప్ర‌భుత్వం జావా బైక్ ని… బ‌హుమ‌తిగా ఇచ్చింది. ఈ విష‌యాన్ని ట్వీట్ చేస్తూ.. ఓ బ‌డా హీరోపై సెటైర్ వేయాల‌ని చూశాడు పీవీపీ. `లంగా డాన్సులు` అంటూ ఓ ప్ర‌ముఖ హీరోని ఉద్దేశించి ట్వీట్ చేయ‌డంతో.. పీవీపీపై విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.

”నువ్వు సినిమా ఇండ్ర‌స్ట్రీ నుంచే వ‌చ్చాయి.. ఆ హీరోల చుట్టూనే తిరిగావు. వాళ్ల‌తో సినిమాలు చేసి, ఇప్పుడు వాళ్ల‌పైనే జోకులేస్తావా” అంటూ కొంత‌మంది పీవీపీని ట్రోల్ చేస్తున్నారు. అక్క‌డితో ఆగిపోలేదు… `అస‌లు నువ్వు ఈ స‌మాజానికి చేసిందేంటి` అని ప్ర‌శ్నిస్తున్నారు. పీవీపీ ట్వీట్… ప‌వ‌న్ క‌ల్యాణ్ ని ఉద్దేశించింద‌న్న‌ది కొంద‌రి మాట‌. ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీ పెట్టిన‌ప్పుడు, పార్టీ ప్ర‌క‌ట‌న కార్య‌క్ర‌మానికి స్పాన్స‌ర్ చేసింది పీవీపీనే అని పెద్ద టాక్ న‌డిచింది. అంతే కాదు.. త‌ను జ‌న‌సేన టికెట్ కూడా ఆశించాడ‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర‌వాత‌… వైకాపా త‌ర‌పున విజ‌య వాడ నుంచి పోటీ చేశాడు పీవీపీ. అప్పట్నుంచి ప‌వ‌న్ తో సంబంధాలేం లేవు. అందుకే ఇప్పుడు ఆ క‌క్ష‌ని ఇలా తీర్చుకుంటున్నాడేమో అని.. పీవీపీని ఓ రేంజులో ఆడుకుంటున్నారు జ‌నాలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close