అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కా, హిల్లరీ కా మీ ఓటు అని అడిగితే… వాళ్లిద్దరికీ కాదు క్లంప్ కే మీ ఓటు అని ట్విట్టర్ లో ఒక మెసేజ్ వచ్చింది. ఈ స్థాయిలో ఆలోచించగల వారేవరుంటారబ్బా అని పోస్ట్ చేసిన వారి పేరు చూస్తే… అది మరెవరో కాదు… మనకు బాగా తెలిసిన వ్యక్తి, రొటీన్ కి భిన్నంగా ఆలోచించగలిగే వ్యక్తి, ప్రపంచంలో జరిగే ఏ విషయంపై అయినా తనదైన శైలిలో సింగిల్ లైన్ సొల్యూషన్ లేక సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇవ్వగల దిట్ట, మహా మేధావి, దార్శనికుడు, దర్శకుడు… ఇప్పటికే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇక నాన్చేది లేదు చెప్పేస్తున్నా… అయిన రాం గోపాల్ వర్మ!
ఒకపక్క అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటివరకూ ఏనాడూ ఈస్థాయిలో రసవత్తరంగా సాగలేదేమో అమెరికా ఎన్నికలు అనేస్థాయిలో ట్రంప్ – హిల్లరీలో అంతర్జాతీయ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. నేటి ఎన్నికలపై దృష్టి సారించినంతగా ఇప్పటివరకూ జరిగిన ఏ ఎన్నికలపైనా ప్రపంచం మొత్తం ఈ స్థాయిలో దృష్టి సారించి ఉండకపోవచ్చు. ఆ స్థాయిలో మోస్ట్ వయలెంట్, మోస్ట్ కాంపిటేటివ్ అండ్ మోస్ట్ రొమాంటిక్ గా జరుగుతున్న ప్రచారానికి సంబందించిన ఎలక్షన్స్ త్వరలో జరగనున్నాయి. ఆ స్థాయిలో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఈ విషయంలో హిల్లరీని గెలిపించాలా లేక ట్రంప్ ను గద్దె ఎక్కించాలా అనే డైలెమాలో ఉన్నారు అమెరికన్లలు. ఈ సమయంలో వీరి సందిగ్ధ పరిస్థితికి తనదైన సొల్యూషన్ చూపిస్తోన్న వర్మ వీరిద్దరూ వద్దు “క్లంప్”కి ఓటెయ్యండి అంటున్నారు.
ట్రంప్, హిల్లరీ ఫొటోలను కలిపి రూపొందించిన చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. “ఎవరికి ఓటెయ్యాలా అని కంఫ్యూజ్ అవుతున్న అమెరికన్ల కోసం ట్విట్టరూన్ మరో అభ్యర్ధిని రూపొందించింది. అతని పేరే క్లంప్. అంటే క్లింటన్, ట్రంప్ అన్నమాట” అంటూ ట్వీట్ చేశారు వర్మ. ఈ వర్మ చేసిన సృష్టి ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది.
Hey @realDonaldTrump @HillaryClinton Is this Trillary or Clump? pic.twitter.com/EbWxxL93Yn
— Ram Gopal Varma (@RGVzoomin) October 19, 2016
For confused Americans not knowing whom to vote between Trump n Clinton a twitteroon created a new candidate ..CLUMP pic.twitter.com/1KGguFxbRw
— Ram Gopal Varma (@RGVzoomin) October 18, 2016