బాలీవుడ్ హీరోల‌కూ.. మ‌న హీరోల‌కూ ఉన్న‌ తేడా చెప్పిన వ‌ర్మ‌

యాంటీ బాలీవుడ్ ట్రెండ్ కొన‌సాగుతోంది. బాలీవుడ్ సినిమాల్ని, అక్క‌డి హీరోల్నీ బాయ్ కాట్ చేయ‌డం ఓ ఉద్య‌మంలా మారుతోంది. ఈ జాబితాలో.. బ్ర‌హ్మాస్త్ర ఒక్క‌టే త‌ప్పించుకోగ‌లిగింది. మిగిలిన సినిమాల‌న్నీ బోల్తా కొట్టాయి. బాయ్ కాట్ తో పాటుగా…. సినిమాలో కంటెంట్ లేక‌పోవ‌డంతో దారుణ‌మైన డిజాస్ట‌ర్లు త‌గిలాయి. అయితే… బాలీవుడ్ హీరోల ఆటిట్యూడ్ కూడా.. ఈ బాయ్ కాట్ ఉద్య‌మానికి ఓ కార‌ణ‌మంటూ అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు వ‌ర్మ‌. తెలుగు హీరోలు చాలా విన‌మ్రంగా ఉంటార‌ని, బాలీవుడ్ హీరోలు ఆటిట్యూడ్ చూపిస్తార‌ని, మీడియా ముందు పొగ‌రుగా మాట్లాడ‌తార‌ని, ఈ తేడాని బాలీవుడ్ జ‌నాలు క‌నిపెట్టార‌ని, అందుకే.. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్ లాంటి హీరోలు త‌మ వినమ్ర‌త‌తో.. బాలీవుడ్ ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని గెలుచుకొన్నార‌ని, ఇప్పుడు తెలుగు హీరోల్ని బాలీవుడ్ కాపీ కొడుతోంద‌ని వ్యాఖ్యానించారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ ఆటిట్యూడ్ విష‌యం గురించి ప్ర‌స్తావిస్తూ ”విజ‌య్ ముందు నుంచీ అలానే ఉన్నాడు. త‌న ఆటిట్యూడే త‌న‌ని స్టార్‌ని చేసింది. అయితే ఇప్పుడు త‌న‌ది కూడా రాంగ్ టైమింగే. ఎందుకంటే బాలీవుడ్ లో ఆటిట్యూడ్ ఉన్న హీరోల్ని.. అక్క‌డి ప్రేక్ష‌కులు ఆద‌రించ‌డం లేదు. వాళ్ల‌కు ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్‌లా విన‌మ్రంగా ఉండే హీరోలే నచ్చుతున్నారు. పైగా ఒక‌రు ఎదుగుతోంటే ఈర్ష్య‌, అసూయ‌తో ఓర్వ‌లేని జ‌నాలు పోగైపోతారు. వాళ్లు నెగిటీవ్ ట్రోలింగ్స్ తో కార్న‌ర్ చేస్తారు.. విజ‌య్ విష‌యంలో ఇదే జ‌రిగింది” అని చెప్పుకొచ్చాడు వ‌ర్మ‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సెకండాఫ్ మార్చేసిన విశ్వ‌క్‌

విశ్వ‌క్‌సేన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం దాస్ కా ధ‌మ్కీ. ఈ చిత్రానికి ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ క‌థ అందించాడు. త‌ను ఇప్పుడు ఓ కాస్ట్లీ రైట‌ర్‌. ధ‌మాకా చిత్రానికీ త‌నే...

సుహాస్‌కి ఇంత డిమాండా..?

చిన్న చిన్న సినిమాల్లో, చిన్న చిన్న పాత్ర‌ల‌తో ఎదిగాడు సుహాస్‌. యూ ట్యూబ్ నుంచి.. వెండి తెర‌కి ప్ర‌మోష‌న్ తెచ్చుకొన్నాడు. హీరో అయ్యాడు. క‌ల‌ర్ ఫొటోతో త‌న‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ...

తమ్మినేని సీతారాం LLB వివాదం !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాను పదవి చేపట్టిన తరవాత న్యాయపరిజ్ఞానం ఉండాలనుకుంటున్నారేమో కానీ ఎల్ఎల్‌బీ చదవాలనుకున్నారు. హైదరాబాద్‌లో ఓ లా కాలేజీలో చేరారు. మూడేళ్లు దాటిపోయింది. కానీ ఆయన...

“లీక్‌” రాజకీయం – బీఆర్ఎస్‌ రాంగ్ స్టెప్ ?

టీఎస్‌పీఎస్సీ లీక్ వ్యవహారాన్ని రాజకీయ రంగు పులమడానికి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసలు విషయాల కన్నా కొసరు విషయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయ ఆరోపణలకు సిట్ కేసులు పెట్టించే ప్రయత్నం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close