కొండా మురళి, సురేఖ బయోపిక్‌పై ఆర్జీవీ దృష్టి !

ఎవరి బయోపిక్‌లు తీద్దామా అని ఎదురు చూస్తున్న రామ్‌గోపాల్ వర్మకు వరంగల్ రెబల్ లీడర్స్ కొండా సురేఖ, కొండా మురళి దంపతులు కనిపించారు. వారి రెబలిజం గురించి ఆలస్యంగా తెలిసిందో లేకపోతే ఎవరైనా కొత్తగా చెప్పారేమో కానీ ఇప్పుడు వారి లైఫ్‌పై రామ్ గోపాల్ వర్మ చాలా ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా తీయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. వరంగల్ వెళ్లి వారికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. కొండా మురళీ చదువుకున్న కాలేజీలు.. కొండా సురేఖతో పెళ్లి ఎలా జరిగింది .. ఆ తర్వాత రాజకీయాల్లో ఎలా ఎదిగారు లాంటి విషయాలన్నింటినీ ఆయన తెలుసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

వరంగల్ రాజకీయాల్లో కొండా దంపతులకు ఓ ప్రత్యేకత ఉంది. కొండా మురళిపై రౌడీ అనేముద్ర ఉంది. ఆయన పై చాలా ఆరోపణలు ఉన్నాయి. మొదట ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరుడిగా ఉండేవారు. తర్వాత ఆయనకే ఎదురు తిరిగాడు. ఎర్రబెల్లి టీడీపీలో ఉంటే .. ఆయనకు పోటీగా కొండా మురళిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రోత్సహించాడు. అయితే ఆయనపై ఉన్న ముద్ర కారణంగా ప్రజా జీవితంలోకి కొండా సురేఖకు చాన్సిచ్చారు. పరోక్షరాజకీయాల్లో కొండా మురళీ ఉండేవారు. ఇద్దరూ రాజకీయంగా రెబల్ గా ఉంటారు.

అయితే వారి ప్రాభవం వైఎస్ చనిపోయిన తర్వాత తగ్గిపోయింది. జగన్మోహన్ రెడ్డి పంచన చేరినా ఆయన మోసం చేశాడని బయటకు వచ్చేశారు. తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. అక్కడ వారిని పట్టించుకోలేదు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. ఎక్కడున్న వారి ఫైర్ బ్రాండ్ రాజకీయాలు వారు చేస్తూంటారు. అందుకే ఆర్జీవీకి వారి బ్యాక్ గ్రౌండ్ నచ్చినట్లుగా అందుకే బయోపిక్ తీసేందుకు పరిశీలన ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘పుష్ప’లో రంగమ్మ మంగమ్మ మ్యాజిక్

https://www.youtube.com/watch?v=C70GJYVoZ4Y ''రంగస్థలం' లాంటి క్లాసిక్ తర్వాత సుకుమార్ చాలా గ్యాప్ తీసుకున్నారు. అల్లు అర్జున్ డేట్స్ దొరికేవరకూ వేరే ప్రాజెక్ట్ ముట్టుకోలేదు. చాలా హార్డ్ అండ్ గ్రౌండ్ వర్క్ చేసి ‘పుష్ప' ని సెట్స్...

బీ టౌన్ టాక్ : అల్లు అర్జున్ రాక్ స్టార్

అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ న్యూస్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిర్మాత కరణ్ జోహార్ అల్లు అర్జున్ ని రాక్ స్టార్ గా పిలిచారు. బుధవారం జరిగిన 'వరుడు కావలెను' ప్రీ...

వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ ఇన్నింగ్స్ !?

హైదరాబాద్ వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో తాము ఇప్పటికే సంప్రదింపులు జరిపామని చేరేందుకు అంగీకరించారని అంటున్నారు. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి,...

ఆఫీసర్ “మమత” అంటే మజాకానా ?

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల్లోని ముఖ్య నేతలు టీఆర్ఎస్‌లో చేరి పదవులు అందుకున్న తర్వాత ఉద్యోగ సంఘాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం వచ్చింది. అలాంటి వారిలో టీజీవో అధ్యక్షురాలిగా ఉన్న మమత...

HOT NEWS

[X] Close
[X] Close