‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’… బాలయ్య‌కు అంకితం

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి ప‌క్క‌లో బ‌ల్లెంలా త‌యారైంది. ఈ సినిమాతో త‌మ పార్టీని ఎలా ముంచ‌బోతున్నాడో తెలీక‌.. బెంగ పెట్టుకుంది టీడీపీ. అది చాల‌ద‌న్న‌ట్టు… ఇప్పుడు ఏకంగా ఈ సినిమాని నంద‌మూరి బాల‌కృష్ణ‌కు అంకితం అంటూ ప్ర‌క‌టించి – ఇంకొంచెం టెన్ష‌న్ క్రియేట్ చేశాడు రాం గోపాల్ వ‌ర్మ‌.

”ఏ సినిమాకైనా స్ఫూర్తి ఓ వ్య‌క్తే అవుతాడు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీయాల‌న్న ఆలోచ‌న కేవ‌లం బాల‌కృష్ణ వ‌ల్లే వ‌చ్చింది. ఆయ‌న్ని క‌ల‌వ‌క‌పోతే అస‌లు ఈ సినిమా తీసేవాడ్నే కాదు. అందుకే ఈ సినిమాని ఆయ‌న‌కు అంకితం చేస్తున్నా” అంటూ ప్ర‌క‌టించాడు వ‌ర్మ‌.

ఎన్టీఆర్ బ‌యోపిక్ కోసం ముందు వ‌ర్మ‌ని సంప్ర‌దించిన సంగ‌తి తెలిసిందే. కానీ… ఆ ప్రాజెక్టు వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. ఆ సినిమా త‌న చేతుల్లోంచి జారిపోయిన త‌ర‌వాతే వ‌ర్మ ఈ సినిమాని ప్ర‌క‌టించాడు. కేవ‌లం బాల‌య్య‌పై కోపంతోనే వ‌ర్మ ఈ సినిమా తీశాడ‌న్న‌ది సినీ జ‌నాల‌కు బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. దాన్ని ఇప్పుడు త‌న మాట‌ల‌తో నిజమే అని నిరూపించాడు వ‌ర్మ‌.

ఈ సినిమా తీస్తాన‌ని ప్ర‌క‌టించిన‌ప్పుడు, తీస్తున్న‌ప్పుడు, విడుద‌ల‌కు సిద్ధం అవుతున్న‌ప్పుడు త‌న‌కు చాలా బెదిరింపులు వ‌చ్చాయ‌ని, అయితే తాను బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌న‌ని, ఏదైనా చేసేవాళ్లు బెదిరించ‌ర‌ని, ఒక‌వేళ ఇంకా ఇంకా బెదిరిస్తే తాను కూడా వాళ్ల‌ని బెదిరిస్తాన‌ని త‌న‌దైన శైలిలో చెప్పుకొచ్చాడు వ‌ర్మ‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com