న్యూ ఐడియా: ట్రైల‌ర్‌కీ టికెట్టు

ఎడారిలో ఇసుక అమ్మే తెలివితేట‌లు అచ్చంగా రామ్ గోపాల్ వ‌ర్మ సొంతం. ఓ సీ గ్రేడ్ షార్ట్ ఫిల్మ్ తీసి, దానికి వంద‌, రెండొంద‌లు టికెట్టు పెట్టి, ప్రేక్ష‌కుల నుంచి ఎంతో కొంత గుంజాడు రాంగోపాల్ వ‌ర్మ‌. ఇప్పుడు ట్రైల‌ర్‌కీ టికెట్టు పెట్టి పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నాడు.

వ‌ర్మ సంధిస్తున్న మ‌రో అస్త్రం `ప‌వ‌ర్ స్టార్‌`. ఈ సినిమా ఎలా ఉన్నా, అందులో ఏమున్నా, ప‌వ‌న్ ఫ్యాన్స్‌, యాంటీ ఫ్యాన్స్ చూస్తార‌ని వ‌ర్మ ఆశ‌. షార్ట్ ఫిల్మ్ లా 30 నిమిషాల సినిమా తీసి, జ‌నం మీద‌కు వ‌దిలి డ‌బ్బులు చేసుకుందామ‌నుకున్నాడు. అయితే.. ఇది ప‌వ‌న్ సినిమా క‌దా. క్రేజ్ ఎక్కువ‌. ఆ క్రేజ్ ని ట్రైల‌ర్ నుంచే క్యాష్ చేసుకోవాల‌ని ఆరాట ప‌డుతున్నాడు.

ఓ సినిమా విడుద‌ల‌కు ముందు దానికి సంబంధించిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ వ‌ద‌ల‌డం చాలా సాధార‌ణ‌మైన విషయం. `ప‌వ‌ర్ స్టార్` ట్రైల‌ర్ కూడా వ‌ర్మ వ‌దులుతాడు. కాక‌పోతే ఆ ట్రైల‌ర్ చూడాల‌న్నా.. డ‌బ్బులు క‌ట్టాలి. ఒక్కో టికెట్‌కీ ప‌ది రూపాయ‌లు సంపాదించినా, చాల్లే.. అనేది వ‌ర్మ ఆలోచ‌న‌. ట్రైల‌ర్ చూస్తే గానీ, సినిమాపై ఓ అంచ‌నాకు రాలేం. జ‌న‌మంతా ట్రైల‌ర్ చూసి, సినిమా చూడ‌రేమో అన్న‌ది వ‌ర్మ డౌటు. అందుకే రేటు పెట్టాడు. వ‌ర్మ నుంచి ఏ చిన్న వీడియో వ‌చ్చినా జ‌నం ఆస‌క్తిగా గ‌మ‌నిస్తుంటారు. దాన్నే ఇప్పుడు క్యాష్ చేసుకోవాల‌నుకుంటున్నాడు. ప‌ది రూపాయ‌ల టికెట్ అంటే జ‌నాల‌కు పెద్ద మేట‌ర్ కాదు. క‌నీసం ఐదారు ల‌క్ష‌లు చూసినా – బ‌డ్జెట్ కేవలం ట్రైల‌ర్ తో సంపాదించుకోవొచ్చు.

ఈ పాడు ఐడియాలు రాజ‌మౌళి లాంటికొస్తే ఇంకేం ఉండేది. ఆర్‌.ఆర్‌.ఆర్ టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, ఫ‌స్ట్ లుక్ ల‌కు టికెట్లు పెట్టి ఉంటే.. ఈ పాటికి ఆయ‌న బ‌డ్జెట్ ఆయ‌న‌కు వ‌చ్చేద్దును. వ‌ర్మ‌ని చూసి, మిగిలిన‌వాళ్లంతా ఇలానే ఆలోచిస్తే – ప్రేక్ష‌కుడి జేబు గుల్ల‌యిపోవ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అయితే హైకోర్టు.. లేకపోతే సుప్రీంకోర్టు – తెలంగాణ సర్కార్ తంటాలు !

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి వెళ్లకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సీబీఐకే ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో ఈ రోజు మళ్లీ సింగిల్ బెంచ్ మీద .. అత్యవసరంగా...

విజయసాయిరెడ్డి అసలు క్యారెక్టర్ మళ్లీ బయటకు !

లోపల క్యారెక్టర్ అలాగే ఉంది.. బయటకే మంచిగా కనిపిస్తున్నా అని విజయసాయిరెడ్డి మరోసారి నిరూపించారు. కొన్నాళ్లుగా ఆయన తాను మారిపోయినట్లుగా.. పెద్ద మనిషినన్నట్లుగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పార్లమెంట్‌లో అసలు...

జగన్ జైలుకుపోతే షర్మిలే సీఎం !

తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్ బిడ్డ షర్మిల కష్టాన్ని బీఆర్ఎస్ నేతలు తేలికగా తీసుకుంటున్నారు. ఓట్లు రాని ఇంత కష్టం ఎందుకని.. కాస్త కష్టపడితే పదవి వచ్చే మార్గాన్ని బీఆర్ఎస్ నేతలు విశ్లేషించి...

జగన్‌కు “అప్పు రత్న” బిరుదిచ్చిన పవన్ !

సీఎం జగన్ చేస్తున్న అప్పులపై జనసేనాని పవన్ కల్యాణ్ సెటైర్ వేశారు. ఆయనకు అప్పు రత్న అవార్డు వచ్చినట్లుగా అధికారులు ఆయనకు ఓ మెమెంటోను తెచ్చి ఇస్తున్నట్లుగా కర్టూన్ తన సోషల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close