ఈ ‘క్లైమాక్స్’ ఓటీటీ కోస‌మా?

రాంగోపాల్ వ‌ర్మ స‌డ‌న్‌గా `క్లైమాక్స్‌` చూపించేశాడు. ఈ సినిమా ఎప్పుడు మొద‌లెట్టాడో, ఎప్పుడు పూర్తి చేశాడో తెలీదు గానీ, ఈరోజు టీజ‌ర్ విడుద‌ల చేశాడు. ఈనెల 18న ట్రైల‌ర్ రాబోతోంది. హాట్ బ్యూటీ మియా మాల్కోవాతో తీసిన సినిమా కాబ‌ట్టి, ఎంతో కొంత బ‌జ్ ఉంటుంది. అయితే ఈసినిమాని వ‌ర్మ ఓటీటీ కోసం తీసిన‌ట్టు అనిపిస్తోంది. ఇది వ‌ర‌కు మియా మాల్కోవాతో `జీఎస్‌టీ` తీశాడు. అయితే అది థియేట‌ర్లో విడుద‌ల కాలేదు. ఆన్ లైన్ ద్వారా ప్ర‌యోగాత్మ‌కంగా విడుద‌ల చేశాడు. ఇప్పుడు కూడా అలాంటి ప‌రిస్థితులే ఉన్నాయి. టీజ‌ర్ చూస్తే చాలు.. ఈసినిమాకి సెన్సార్ అవ్వ‌డం క‌ష్ట‌మే అనిపిస్తోంది. అయినా.. విడుద‌ల చేసే అవ‌కాశాల్లేవు. లాక్ డౌన్ వ‌ల్ల థియేట‌ర్లు తెర‌వ‌లేని ప‌రిస్థితి. తెరిచినా ఇలాంటి సినిమాల్ని కొనేవారెవ‌రు? అస‌లే వ‌ర్మ త‌న క్రేజ్‌ని పోగొట్టుకున్నాడు. వ‌ర్మ హిట్టు కొడితే చూడాల‌ని చాలామంది ఎదురు చూస్తున్నా – అలాంటి గొప్ప ప్ర‌య‌త్నాలేం త‌న నుంచి రావ‌డం లేదు. ప్ర‌స్తుతం ఓటీటీకి మంచి మార్కెట్ ఉంది. దానికి తోడు… ఈ సినిమా బ‌డ్జెట్ ప‌రిమితుల‌కు లోబ‌డే తీసి ఉంటాడు. ఓటీటీకి అమ్ముకున్నా ఈ సినిమా గ‌ట్టెక్కేయ‌డం ఖాయం. సో… క్లైమాక్స్‌ని ఓటీటీ లో చూసే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. మే 18న ట్రైల‌ర్ చూస్తే… ఓటీటీలో అయినా ఈ సినిమా చూడ‌గ‌ల‌మా? లేదా? అనే దానిపై ఓ అంచ‌నాకు రావొచ్చు.

Climax Teaser

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close