ఆర్జీవీ ధర్మసందేహం..! శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మిపార్వతిలో ఏముంది..?

శ్రీదేవి మాత్రమే.. ప్రపంచంలో అత్యంత అందగత్తె అని రామ్ గోపాల్ వర్మ భావిస్తూంటారు. ఆ అభిప్రాయాన్ని ఏ మాత్రం దాచుకోరు. ఎంతో మంది హీరోయిన్లతో సినిమాలు చేసినా… తనే స్వయంగా పరిచయం చేసిన అందగత్తెలు టాప్ పొజిషన్‌కు వెళ్లినా.. ఆయన ఎప్పుడూ ఆయా హీరోయిన్లను..శ్రీదేవితో పోల్చలేదు. ఎంత వారలైనా కాంత దాసులేనన్నట్లుగా… మగపుట్టుక పుట్టిన వాళ్లంతా.. శ్రీదేవి అందానికి ఫిదా అవ్వాల్సిందేనని ఆయన థీయరి. అలాంటిది.. ఇప్పుడు ఆయనకు ఓ సందేహం వచ్చింది. అది.. లక్ష్మిపార్వతి విషయంలో. శ్రీదేవి, జయప్రదల్లో లేనిది.. లక్ష్మిపార్వతిలో ఎన్టీఆర్‌కు ఏమి కనిపించిందనేది ఆయన ధర్మసందేహం. ఎన్టీఆర్ పలు సందర్భాల్లో లక్ష్మిపార్వతి గురించి చప్పారని.. అలనాటి నటీమణలు శ్రీదేవి, జయసుధ, జయప్రదలో లేని ఆకర్షణ… లక్ష్మీపార్వతిలో ఎముందని ఆశ్చర్యపోయానని రాంగోపాల్‌ వర్మ చెబుతున్నారు. శ్రీదేవి, జయప్రదలంతటి అంతటి ఆకర్షణను కాదని… ఎన్టీఆర్‌ లక్ష్మీపార్వతిని పెళ్లిచేసుకోవడంపై సందిగ్ధంలో పడిపోయాననన్నారు. అప్పుట్లో ఆ విషయం తన ఊహకు అందలేదన్నారు.

మరి ఈ విషయాన్ని ఆర్జీవీ.. సినిమాలో ఎలా చూపిస్తారన్న చర్చ ప్రారంభమైంది. ఎన్టీఆర్ ను ఆకట్టుకునేలా.. శ్రీదేవి, జయప్రదల వద్ద లేని లక్షణం.. లక్ష్మిపార్వతి వద్ద ఏముందనే అంశాన్ని … ఆర్జీవీ ఎలా చూపిస్తారన్న సందేహం సహజంగానే అందరికీ వస్తుంది. పూర్తిగా లక్ష్మీపార్వతి కోణంలోనే సినిమా తీస్తున్నారు కాబట్టి.. కచ్చితంగా… ఎన్టీఆర్ జీవితంలోనే… లక్ష్మిపార్వతి ఎలా ఎంటర్ అయ్యారన్న విషయాన్ని చూపించాలి. అందుకే కొద్ది రోజులుగా.. లక్ష్మి పార్వతితో ఆర్జీవీ చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కోసం… ఆర్జీవీ లక్ష్మీ పార్వతితో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి… ఆమె గురించి తెలిసే అవకాశం ఉంటుందని.. సోషల్ మీడియాలో కామెంట్లు పడిపోతున్నాయి.

మరో వైపు సినిమా కెరీర్ పొడిగింపు కోసం.. ఆర్జీవీ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇన్నాళ్లూ లేని దేవుడి భక్తిని తెచ్చి పెట్టుకున్నారు. సెంటిమెంట్లు నమ్ముకుంటున్నారు. పనిలో పనిగా సినిమాకు క్రేజ్ తెచ్చి పెట్టేందుకు తనకు మాత్రమే.. సాధ్యమైన.. వివాదాలనూ బయటకు తీస్తున్నారు. మరి చివరికి ఫలితం ఏమవుతుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close