రిషికపూర్ మేకోవర్ కోసం రు.2 కోట్లా!

హైదరాబాద్: రణబీర్ కపూర్ తండ్రి, అలనాటి కథానాయకుడు రిషికపూర్ ప్రస్తుతం తండ్రి పాత్రలు, తాత పాత్రలు వేస్తున్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ షకున్ బాత్రా దర్శకత్వంలో నిర్మిస్తున్న కపూర్ అండ్ సన్స్ అనే చిత్రంలో రిషికపూర్ 90 ఏళ్ళ ఒక వృద్ధుడి పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్రకు మేకప్‌ను హాలీవుడ్‌కు చెందిన నిపుణుడు గ్రెగ్ క్యానమ్ చేశారు. గ్రెగ్ ‘టైటానిక్’ చిత్రానికి బ్రాడ్ పిట్ నటించిన ‘ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమన్ బటన్’ చిత్రానికి పనిచేశారు.

90 ఏళ్ళ వృద్ధుడిగా కనిపించేందుకు ఆ ప్రత్యేక మేకోవర్ కోసం మొత్తం రు.2 కోట్ల ఖర్చయినట్లు రిషికపూర్ వెల్లడించారు. ఈ చిత్రంలో సిద్దార్థ మల్హోత్రా, అలియా భట్, ఫవాద్ ఖాన్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. చిత్రంలో రిషికపూర్ పోషించే పాత్ర చాలా ముఖ్యమైనదని, అందుకే ఎంత ఖర్చుకయినా వెనకాడలేదని దర్శకుడు షకున్ బాత్రా చెప్పారు. ఈ చిత్రం గురించి చర్చించటానికి రిషికపూర్ వద్దకు వెళ్ళినపుడు ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమన్ బటన్ చిత్రంలోని బ్రాడ్ పిట్ ఫోటోను చూడటం జరిగిందని, దానికి తోడు గ్రెగ్ ఆ సమయంలో ముంబాయిలోనే ఉండటంతో అతనిని సంప్రదించామని బాత్రా చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ దళిత రైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యే..!

నెల్లూరు జిల్లాలో ఓ దళిత రైతు.. తన భూమిని బలవంతంగా లాక్కుంటున్నారన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్నాయి. అయితే.....

‘ల‌వ్ స్టోరీ’ ప్లానింగు ఇదీ….

సాధార‌ణంగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు తీసే తీరు పాసింజ‌ర్ రైలుని త‌ల‌పిస్తుంటాయి. ఆగి... ఆగి.. కొంచెం.. కొంచెం.. త‌న మూడ్ ని బ‌ట్టి, షూటింగ్ చేస్తుంటాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దానికి త‌గ్గ‌ట్టుగా లాక్...

ఆర్‌.ఎఫ్‌.సీలో సెటిలైపోతున్న రౌడీ

పూరి జ‌గ‌న్నాథ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది. క‌థ ప్ర‌కారం సినిమా మొత్తం ముంబైలోనే...

‘ఓ పిట్ట క‌థ’ లాభాల వెనుక పెద్ద క‌థ‌

లాక్ డౌన్‌కి ముందు, థియేట‌ర్లు మూసివేయ‌డానికి ఓ వారం ముందు విడుద‌లైన సినిమా 'పిట్ట‌క‌థ‌'. మంచి ప‌బ్లిసిటీతో విడుద‌లైన ఈ చిన్న సినిమా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్నీ చూపించ‌లేక‌పోయింది. క‌రోనా...

HOT NEWS

[X] Close
[X] Close