బీహార్ ఎన్నికలు కూటమి రాజకీయాలకు పెద్ద ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కూటముల్లోనూ పెద్ద ఎత్తున పార్టీలు ఉన్నాయి. ఈ కారణంగా ఏ ఒక్క పార్టీ కూడా కనీసం మెజార్టీ సీట్లలో పోటీ చేయలేకపోతున్నాయి. ప్రస్తుతం బీహార్లో అతి ఎక్కువ సీట్లలో పోటీ చేసే పార్టీ ఆర్జేడీనే. మొత్తం 14౩ స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను ప్రకటించింది. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ తో కూటమిలో భాగంగా ఆ పార్టీకి 61 సీట్లు కేటాయించింది. కమ్యూనిస్టులూ ఈ కూటమిలోనే ఉన్నారు. కానీ కొంత మంది కాంగ్రెస్ నేతలు.. ఆర్జేడీ పోటీ చేసే చోట ఫ్రెండ్లీ ఫైటింగ్ అని నామినేషన్లు వేస్తున్నారు.
బీజేపీ , జేడీయూ కూటమిలో కూడా సీట్ల సర్దుబాటు పూర్తి అయింది. బీజేపీ 101 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. జేడీయూ 102 స్థానాల్లోపోటీ చేస్తోంది. మిగతావి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడి పార్టీకి కొన్ని, ఇతర పార్టీలకు కొన్ని కేటాయించారు. మజ్లిస్ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. కానీ ఏ కూటమిలోనూ చేరలేదు. గతంలో మజ్లిస్ పార్టీ హాట్ టాపిక్ అయింది. కానీ ఈ సారి ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట్ల అభ్యర్థులను ఓవైసీ నిలబెడుతున్నారు.
ప్రశాంత్ కిషోర్ పార్డీ జనసురాజ్కు ఇలాంటి సమస్యలు లేవు. ఎక్కడ బలమైన అభ్యర్థి ఉంటే అక్కడ పోటీ చేస్తున్నారు. తేజస్వీ యాదవ్ పై రఘోపూర్ నుంచి పోటీ చేయాలనుకున్న ప్రశాంత్ కిషోర్ వెనక్కి తగ్గడంతో బీహార్ లో.. అత్యంత ఆసక్తికరమైన పోటీలు లేకుండా పోయాయి. సీఎం నితీష్ ఎన్నికల్లో పోటీ చేరు. సీఎం అభ్యర్థుల్లో ఒక్క తేజస్వీ యాదవ్ మాత్రమే పోటీ చేస్తున్నారు.
