ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే జగన్ రెడ్డి తీరు ఎంత రాక్షసత్వంగా ఉంటుందో పరోక్షంగా తన వారాంతపు ఆర్టికల్ లో వివరించారు. తన స్వార్థం కోసం తల్లీ .. చెల్లీ ఎవరినైనా ఎలా వేధిస్తారో అవసరం కోసం ఎలా దగ్గరకు తీసుకుంటారో.. అవసరం తీరిపోయాక ఎలా పక్కన పడేస్తారో కొత్తపలుకులో ఆర్కే వివరించారు. కుటుంబమంతా రోడ్డున పడటానికి జగన్ రెడ్డి స్వార్థమేనని జరిగిన పరిణామాలతోనే విశ్లేషించారు.
వచ్చే ఎన్నికల్లో కడపలో వైఎస్ కుటుంబ చరిత్ర ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేయబోతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఒకరికొకరు పోటీ పడి మరీ ప్రజల ముందు తమ నీచ చరిత్రను బయట పెట్టుకోబోతున్నారని ఆర్కే హింట్ ఇచ్చారు. ఖచ్చితంగా పులివెదుల అసెంబ్లీ, కడప పార్లమెంట్ స్థానంలలో బరిలోకి దిగబోయేది కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ కుటుంబసభ్యులే. సునీత తల్లి సౌభాగ్యను కడప ఎంపీ స్థానానికి నిలబెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆర్కే చెప్పారు. అయితే వచ్చే నెల రోజుల పరిణామాల్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.
భయంతో జగన్ వణికిపోతున్నాడని తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఓడిపోతే తనను ఎవరూ కాపాడరని.. తన కోసం ప్రచారం చేయాలని తల్లిని జగన్ రెడ్డి బ తిమాలారని దాంతో విజయమ్మ అంగీకరించారని అంటున్నారు. గతంలో ప్రచారం చేసినా .. ఎన్ని అవమానాలు పడినా జగన్ రెడ్డి పట్టించుకోకపోయినా కొడుకు మళ్లీ జైలుకు పోతాడన్న ఆందోళనతో ఆమె ప్రచారానికి అంగీకరించిందని అంటున్నారు. అంటే కొడుకు తనను గెంటేసినప్పుడు అండగా ఉన్న షర్మిలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికే విజయమ్మ రెడీ అయ్యారంటున్నారు.
వైఎస్ కుటుంబంలో ఇక ముందు జరగబోయేది చాలా ఉంటుందని ఆర్కే హింట్ ఇచ్చారు. ఎవరు ఎవరి వైపు వెళ్లినా షర్మిల మాత్రం పంతం వీడే ప్రశ్నే ఉండదని.. త్వరలో బాబాయ్ హత్యపైనా ఆమె మాట్లాడే అవకాశం ఉందని.. అప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని ఆర్కే చెబుతున్నారు.



