కొత్తపలుకు : చాణక్యుడు కంటే కేసీఆరే గొప్ప..!

ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్ వేమూరి రాధాకృష్ణ ప్రతి వారాంతంలో.. తన పత్రికలో రాసే..”కొత్తపలుకు” ఆర్టికల్‌లో ఈ సారి.. పూర్తిగా కేసీఆర్ వ్యూహాలను.. ఆయన తెలివి తేటలను.. ఆయన రాజకీయ వ్యూహాలను పొగడటానికే కేటాయించారు. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేకుండా… మొత్తంగా.. కేసీఆర్ ” కీర్తన”లకే తన సమయం కేటాయించారు. అటు ఆర్టీసీ సమ్మె, ఇటు దిశ నిందితుల ఎన్‌కౌంటర్ విషయంలో.. కేసీఆర్ ఎలా వ్యూహాత్మకంగా వ్యవహరించి.. తన చేతికి మంటి అంటకుండా.. పూర్తిగా క్రెడిట్ కొట్టేశారో.. వివరణాత్మకంగా రాశారు.

ఆర్టీసీ బతికే సమస్యే లేదని.. జీతాలు ఇవ్వలేమని చెప్పిన కేసీఆర్… సమ్మెను తారస్థాయికి తీసుకెళ్లి.. కార్మికులకు ఉద్యోగాలు ఇక లేవన్న భావన కల్పించారు. కొంత మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అప్పుడు అందరికీ చల్లని కబురు చెప్పి.. పాలాభిషేకాలు చేయించుకున్నారు. అంతకు ముందు కేసీఆర్ పెట్టిన కష్టాలన్నింటినీ మర్చిపోయారు. ఇదే సందడిలో ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచారు. చేయాలనుకున్న రెండు పనులను కేసీఆర్ చేసేశారు. ఎక్కడా ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదు. అదే సమయంలో.. దిశ ఘటనపై మాట్లాడలేదని.. కేసీఆర్ ను అందరూ నిన్నటి వరకూ విమర్శించారు. కానీ ఎన్ కౌంటర్ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఆయనకు మైలేజ్ వచ్చింది. ఎన్‌కౌంటర్‌కు.. సీఎం స్థాయిలో పర్మిషన్ రాకపోతే.. పోలీసులు కూడా ఏం చేయలేరని.. ఆర్కే చెబుతున్నారు.

ఈ పరిణామాలన్నీ… ఆర్కేకు అబ్బురంగా అనిపించాయి. అందుకే..” చాణక్యుడికే రాజనీతిని బోధించే సత్తా ఉన్న నేత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు!..” అని సర్టిఫికెట్ ఇచ్చేశారు. ప్రజల భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం… వారి అభీష్టానికి అనుకూలంగా వ్యవహరించి… నిర్ణయాలు తీసుకోవడం వల్ల కేసీఆర్.. గొప్ప పాలకుడిగా నిలబడుతున్నారంటున్నారు. అయితే … ఎన్‌కౌంటర్ నిర్ణయాన్ని మాత్రం ఆర్కే పరోక్షంగా వ్యతిరేకించారు. చట్టాలు, న్యాయవ్యవస్థ ఇంకేం చేయాలన్న ప్రశ్న అంతర్లీనంగా వేశారు. చట్టాలు చేసేవారే.. చట్ట ఉల్లంఘనకు మద్దతుగా మాట్లాడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి భవిష్యత్‌లో ఇబ్బందికర పరిణామాలు తెచ్చి పెట్టబోతున్నాయన్న విషయాన్ని చెప్పీచెప్పకనే .. ఆర్కే చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close