కొత్తపలుకు : ఆంధ్రులు ” ఉత్త వెధవాయలోయ్” అనేసిన అర్కే..!

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారాంతపు ఆర్టికల్ ” కొత్తపలుకు ” లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై…సుతిమెత్తగా సూటిగా.. పరోక్షంగా ఘాటు విమర్శలే చేశారు. రాజధాని అంటే.. రాష్ట్రం మొత్తానికి కాదు.. కేవలం ఒక్క కులానిదే…అదీ కూడా 29 గ్రామాల ప్రజలదే అన్నట్లుగా.. చేస్తున్న ప్రచారాన్ని .. ప్రజలు కూడా.. అలాగే విడిపోవడాన్ని ఆయన గీరిశం డైలాగ్‌తో… పోల్చి నిజమేనని తేల్చేసారు. ఇప్పుడు.. ” అమరావతి ఎవరి కోసం?” అన్న ప్రశ్నను అధికార పార్టీ కూడా వేస్తూండటంతో.. కన్యాశుల్కంలో “మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్” అని గిరీశంతో చెప్పించిన డైలాగు ఆంధ్రులను ఉద్దేశించే అన్నారని భావించవచ్చనని తేల్చేశారు.

రాజధాని వల్ల ఏపీకి రూ. 2 లక్షల కోట్ల లాభం..!

ఒకప్పుడు.. అసెంబ్లీలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి రాజధాని ఎక్కడైనా పెట్టుకోండి.. కనీసం అందుబాటులో 30వేల ఎకరాలన్నా ఉండాలని.. ప్రభుత్వానికి సూచించారు. ఇప్పుడు.. చంద్రబాబు.. ఆ 30వేలకు ఇంకో 20వేల ఎకరాలు పోగేసి.. 50వేల ఎకరాలు అందుబాటులో పెట్టుకుని రాజధాని నిర్మాణం ప్రారంభించారు. చంద్రబాబు వేసిన ప్రణాళి ప్రకారం.. రైతులకు ఇవ్వాల్సినవి పోను… ప్రభుత్వానికి ఏడెనిమిది కోట్ల గజాల స్థలం మిగిలేది. ఈ లెక్కన ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా సమకూరి ఉండేవని ఆర్కే విశ్లేషించారు. ఈ డబ్బుతో రాజధాని నిర్మాణానికి చేసిన అప్పులు తీర్చవచ్చునని అప్పటి ప్రభుత్వం భావించిందన్నారు. చిల్లిగవ్వ లేకపోయినా రాష్ట్ర సంపదను పెంచగలగడం గొప్ప విషయం కాదని ఎవరు మాత్రం అనగలరని ” కొత్తపలుకు “లో ఆర్కే… ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కావాలనుకున్న బొత్స అలా మాట్లాడమేంటి..?

ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో తనదైన శైలి చూపించే.. ఆర్కే.. బొత్స సత్యనారాయణ తీరుపైనా సూటి విమర్శలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కుదిరితే ముఖ్యమంత్రి కావాలని బొత్స సత్యనారాయణ ఆశపడ్డారు. అలాంటి వ్యక్తి.. రాజధాని ప్రాంతాన్ని ఓ కులానికి… ఓ వర్గానికి.., ఓ ప్రాంతానికి అంటకట్టే ప్రయత్నం చేయడాన్ని సునిశితంగానే విమర్శించారు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాల్సి ఉందన్న బొత్స… పదేళ్లకు పైగా మంత్రిగా ఉన్న బొత్స సొంత జిల్లా విజయనగరాన్ని ఎంత అభివృద్ధి చేశారోనని సెటైర్ కూడా వేసారు.

సమస్య రాజధాని రైతులది మాత్రమే కాదు…!

ప్రస్తుతం రాజధాని మార్పు విషయంపై రైతులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కూడా.. ఆర్కే తన ” కొత్తపలుకు “లో తప్పు పట్టారు. సమస్య అయిదుకోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించినదని తేల్చారు. ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందింది అంటే.. కచ్చితంగా… ఓమెట్రో సిటీ లాంటి.. నగరం వల్లేనని.. తేల్చారు. తెలంగాణ సర్కార్ ఇప్పటికీ అప్పులు చేయగలుగుతోందంటే.. హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయాన్ని చూపించేనని.. ఆదిలాబాద్ నుంచి వస్తున్న ఆదాయాన్ని కాదని… ఆర్కే… సునిశితంగానే విశ్లేషించారు. సమకాలిన పరిస్థితులను.. విశ్లేషించడంలో.. ఆర్కే.. ఈ వారం తన మార్క్‌ను చూపించారని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close