కొత్తపలుకు : అధికారులకు చుక్కలు చూపిస్తున్న జగన్..!

ఆంధ్రజ్యోతి మేనిజింగ్ డైరక్టర్ వేమూరి రాధాకృష్ణ “కొత్తపలుకు” ఎప్పుడూ.. టీడీపీయేతర పార్టీలకు వ్యతిరేకంగానే ఉంటుంది. కొన్ని సందర్బాల్లో టీడీపీని కూడా.. ఆయన విమర్శిస్తూ ఉంటారు. చంద్రబాబు తప్పొప్పులను సైతం చెబుతూంటారు. అయితే.. ఆ తప్పు ఒప్పులు వారు తెలుసుకోవాలన్న పద్దతిలో చెబుతూంటారు. గత రెండు, మూడు వారాలుగా..”కొత్తపలుకు” లో జగన్మోహన్ రెడ్డికి కూడా సూచనలు, సలహాలు ఇచ్చిన వేమూరి రాధాకృష్ణ.. ఇప్పుడు… వాటన్నింటినీ పట్టించుకోవడం లేదనుకున్నారేమో.. కానీ.. అసలు ఏపీ అధికారవర్గాల్లో ఏం జరుగుతుందో బయటపెట్టారు. నెలన్నర రోజుల్లోనే… ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ అధికారుల్లో… ఓ రకమైన నిర్వేదం ఏర్పడిందని ఆయన తేల్చారు.

సీఎంను చెబితే జరగదా అంటున్న జగన్..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను ముఖ్యమంత్రిగా చెబుతున్నానని.. అయినా ఎందుకు జరగదని.. అధికారులును ఆదేశిస్తున్నట్లుగా.. “కొత్తపలుకు”లో రాధాకృష్ణ చెబుతున్నారు. దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులకు.. రూ. 18వేల జీతం ఇస్తామని జగన్ ప్రకటించారు. కానీ ఇప్పుడా నిర్ణయాన్ని అమలు చేస్తామని ఎక్కడా చెప్పడం లేదు. ఈ నిర్ణయం ప్రకటించేటప్పుడు… అది సాధ్యం కాదని.. సీఎస్ ఎల్వీ సుబ్రహ‌్మణ్యం చెప్పబోయినా జగన్ పట్టించుకోలేదట. అలాగే.. పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చే బిల్లుపైనా… సౌమ్యురాలైన ఐఏఎస్ అధికారి ఉదయలక్ష్మిని జగన్ కసురుకున్నారని చెబుతున్నారు. ఇలా.. ఎలాంటి నిర్ణయంలో అయినా.. తాను సీఎంను కాబట్టి చెబితే చేయాల్సిందే అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని.. ఆర్కే విశ్లేషించారు.

ముందు ముందు అధికారులు చేతులెత్తేస్తారా..?

“కొత్తపలుకు”లో వేమూరి రాధాకృష్ణ అంతర్లీనంగా చెప్పిందేమిటంటే.. ఏపీలో ఏం జరిగినా అధికారులకు సంబంధం ఉండదు. అంతా జగన్మోహన్ రెడ్డి ఖాతాలోనే పడుతుంది. అధికారుల మాటలు ఆయన వినడం లేదు. చెప్పినట్లు జీవోలు జారీ చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. పథకాలకు అమలు గడువులు ప్రకటిస్తున్నారు. వివిధ వర్గాలకు కొత్త కొత్త ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాల్లో.. ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. ఈ పరిణామాల తీవ్రత.. నాలుగైదు నెలల్లో బయటపడుతుంది. అప్పుడు అధికారులు ఎవరూ బాధ్యత తీసుకునే పరిస్థితి కనిపించడం లేదని.. రాధాకృష్ణ చెబుతున్నారు. మొత్తం… జగన్మోహన్ రెడ్డిపైనే.. జరగబోయే పరిణామాలు ఆధారపడి ఉంటాయంటున్నారు.

ఆర్థిక పరిస్థితిపై కనీస అవగాహన తెచ్చుకోని జగన్..!

జగన్మోహన్ రెడ్డి.. తాము ముఖ్యమంత్రి హోదాలో సంతకం పెడితే.. అన్నీ అయిపోతాయని.. భావిస్తున్నట్లుగా.. వ్యవహరిస్తున్నారని.. రాధాకృష్ణ చెబుతున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా… ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ కనీస అవగాహన తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయకుండా… ఆదేశాల మీద ఆదేశాలు జారీ చేస్తున్నారన్న అసంతృప్తి అధికారుల్లో కనిపిస్తోందంటున్నారు. రైతు భరోసా, అమ్మఒడి , ఆశావర్కర్లు సహా ఇతరులకు జీతాల పెంపు వంటివి.. అధికారులను విస్మయానికి గురి చేస్తున్నాయి. నిధులు ఎక్కడి నుంచి వస్తాయని వారు టెన్షన్ పడుతున్నారు. ఇదే విషయాన్ని కొత్తపలుకులో రాధాకృష్ణ చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close