ఆర్కే పలుకు : గుళ్లపై దాడులు బీజేపీ – వైసీపీ రాజకీయమే..!

ఓ మర్డర్ జరుగుతుంది..! హంతకుడెవరో చాలా మందికి తెలియుదు..! కానీ తెలివైన పోలీస్ ఆఫీసర్ వచ్చి.. ఆ మర్డర్ చేయడం వల్ల ఎవరికి లాభం చేకూరుతుందో ఓ లిస్ట్ తీస్తాడు. వెంటే హంతకుడు దొరికిపోతాడు. ఇది సినిమాలో ఓ సీన్. అచ్చంగా ఇంతే కాకపోయినా… ఇదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ – వైసీపీల అనధికార కూటమిని.. ఆలయాల ధ్వంసం కేసులో ప్రధానంగా అనుమానిస్తున్నారు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. తనదైన రాజకీయ విశ్లేషణలతో ఆ వారం వారం రాసే… వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకులో ఈ సారి ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడుల అంశాల్ని విశ్లేషించారు..!

అసలు ఏపీలో ఆలయాలపై ఎప్పుడూ లేని విధంగా దాడులు ఎందుకు జరుగుతున్నాయి..? ప్రభుత్వం ఎందుకు ఇంకా రెచ్చగొట్టాలనుకుంటోంది..? ఒక్కటంటే.. ఒక్క కేసులోనూ నిందితుల్ని కనీసం అరెస్ట్ చేయలేదెందుకు..? మోడీని అన్ని మాటలన్నా బీజేపీ స్పందన అంత లైట్‌గా ఉంటుందెందుకు..? సోము వీర్రాజే గుళ్లపై దాడులు చేయిస్తున్నారని అన్నా ఆయన నోరు మెదపలేదేందుకు..? ఈ దాడులతో రాజకీయంగా బలపడటానికి బీజేపీ ఏం చేస్తోంది..? ఈ ప్రశ్నలన్నింటికీ ఆర్కే సమాధానం చెప్పారు. అదీ కూడా.. కాదనలేనంత లాజికల్‌గా ఆ సమాధానం ఉంది.

ముందుగా చెప్పినట్లుగా సినిమాలో చెప్పినట్లుగా ఎవరైనా హత్యకు గురైతే.. దాని వల్ల ఎవరికి లాభం కలుగుతుందో వారే ప్రధాన అనుమానితులుగా భావిస్తే.. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రధానంగా అనుమానించాల్సింది బీజేపీనే. అయోధ్య దగ్గర్నుంచి ఆ పార్టీ విధానమే అది. ఏ రాష్ట్రంలో పట్టు సాధించాలనుకున్నా అక్కడ ఆలయాలు ఏదో విధంగా ప్రచారంలోకి వస్తాయి. శబరిమల దగ్గర్నుంచి టీడీపీ హయాంలో తిరుమల వరకు చాలా వచ్చాయి. వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏపీ వంతు. అయితే… ఇదంతా బీజేపీ చేయిస్తున్నదేం కాదని ఆర్కే అంటున్నారు. అధికార పార్టీ తల్చుకుంటే… గుళ్లపై దాడి చేస్తున్న వారిని నిమిషాల్లో పట్టుకోగలరు. పట్టుకోవడం లేదు అంటే.. గూడుపుఠాణి ఉన్నట్లేనంటున్నారు.

మత విద్వేషాల వల్ల బీజేపీ రాజకీయం చేస్తుంది. హిందువుల ఓట్లను ఓ వైపు పోలరైజ్ చేస్తుంది. అంటే ప్రధానంగా విడిపోయేది టీడీపీ ఓటు బ్యాంక్. ఈ పరిణామం వల్ల క్రిస్టియన్లు, ముస్లింలలు వైసీపీ వైపు సంఘటితం అవుతారు. దళితులపై వరుస దాడులతో ఆ వర్గంలో నెలకొని ఉన్న అసంతృప్తి కారణంగా ఇది వైసీపీకి కూడా కీలకమే. అందుకే.. బీజేపీ-వైసీపీ కలిసే.. ఏపీలో మత రాజకీయాలు ప్రారంభించాయని.. గుళ్లపై దాడులు చేస్తున్నారని ఆర్కే విశ్లేషించారు. ఇది అబద్దం అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే… రథాలు తగలబడినా నిందితుల్ని పట్టుకోలేకపోవడం అనే చిన్న లాజిక్ చాలంటున్నారు.

మొత్తానికి ఆర్కే చాలా అంశాలు చెప్పారు కానీ.. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలనుకున్నది మాత్రం ఏపీలో… మత రాజకీయాలకు.. బీజం వేసి.. టీడీపీ ఓటు బ్యాంక్‌ను చీల్చాలని.. వైసీపీ – బీజేపీ కలసి రాజకీయం ప్రారంభించాయని. ఆ దిశగానే హిందూత్వంపై దాడి జరుగుతోందని..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కన్నీటితో భువనేశ్వరి కాళ్లు కడుగుతామన్న వైసీపీ ఎమ్మెల్యే

నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారాన్ని ముగించాలని వైసీపీ నేతలు బతిమాలుతున్నారు. వల్లభనేని వంశీ మీడియా చానళ్లను పిలిచి ప్రతి ఒక్క చానల్‌కు విడివిడిగా ఇంటర్యూలు ఇచ్చి క్షమాపణలు చెప్పారు....

కాంగ్రెస్‌పై ప్రశాంత్ కిషోర్‌కు అంత కసి ఎందుకు !?

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై ఎన్నికలకు వెళితేనే బీజేపీని ఎదుర్కోగలరు..లేకపోతే బీజేపీదే మళ్లీ అధికారం అని.. బెంగాల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ బహిరంగంగానే చెప్పారు. అంతే కాదు ఆయన...

ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన పటేల్…!

అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ కుప్పకూలింది. కానీ ఆ పటేల్ కూడా న్యూజిలాండ్ ప్లేయరే. కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో...

రివ్యూ: స్కై లాబ్‌

తెలుగు360 రేటింగ్: 2.5/5 ఇప్ప‌టి ముచ్చ‌ట కాదు గానీ... 1979 నాటి మాట‌. అప్ప‌ట్లో స్కై లాబ్ గురించి వింత వింత పుకార్లు ప్ర‌చారంలోకొచ్చాయి. ఆకాశం నుంచి ఓ ఉల్క‌, ఉప‌గ్ర‌హ శ‌క‌లాలు భూమిపై...

HOT NEWS

[X] Close
[X] Close