ఆర్కే పలుకు : ఆ అధికారులంతా జైలుకెళ్లాల్సిందే..!

రుణాలు పొంది దారి మళ్లిస్తున్నారంటూ పలువురు పారిశ్రామికవేత్తలపైన కేసులు పెడుతున్నారు… ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ అధికారులంతా అదే పని చేస్తున్నారు. ఉద్దేశించిన పనికి వచ్చిన నిధులన్నింటినీ సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్నారు. మరి వీరికి మాత్రం చట్టం ఎందుకు వర్తించదు..? నిధులను దారి మళ్లిస్తున్న వారినెందుకు జైలుకు పంపరు..? .. ఇదీ ఈ వారం ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ “కొత్తపలుకు”లో వినిపించిన లాజిక్. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితులను విశ్లేషిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అన్ని రకాల నిధులు..ముఖ్యంగా కేంద్రం నుంచి అనేక పథకాల వస్తున్న నిధులను సంక్షేమ పథకాలకు దారి మళ్లిస్తున్నారు. ఇది తీవ్రమైన నేరంగా ఆర్కే చెబుతున్నారు. ఈ నేరం కింద వారిని శిక్షించాల్సిందేనని అంటున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం.. తాము చేస్తున్న తప్పును.. తప్పు అని ఒప్పుకోదు కాబట్టి… ఇప్పుడు కాకపోతే.. ప్రభుత్వం మారిన తర్వాతైనా వారు శిక్షకు గురవ్వాల్సిందేనన్న సందేశాన్ని అంతర్లీనంగా ఆర్కే పంపారు.

ఈ సందర్భంగా ఆర్కే.. ఎ ఏ శాఖల నుంచి ఎంత సొమ్మ దారి మళ్లిందో కూడా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు ఇప్పుడు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం చెబుతున్న పనులు చట్ట విరుద్ధంగాఉండటం వల్ల చేయలేక చాలా మంది పక్కకు తప్పుకుంటున్నారు. ఏదైతే అది జరిగిందిలే… చేస్తున్న అధికారులకు తన ఆర్టికల్ ద్వారా వేమూరి రాధాకృష్ణ నేరుగా హెచ్చరికలు పంపుతున్నారని అనుకోవచ్చు. ఇప్పటికే ఏపీ అధికార యంత్రాగం.. కోర్టుల్లో ధిక్కరణ పిటిషన్‌లను అదే పనగా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఐఏఎస్.. ఐపీఎస్‌లకు జైలు శిక్షలు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో… ప్రభుత్వానికి వ్యతిరేకంగా… అధికార యంత్రాంగం మొత్తాన్ని వ్యతిరేకం చేసే వ్యూహంలో… ఆర్కే తన పలుకుతో మైండ్ గేమ్ ప్రారంభించారని అనుకోవచ్చని అంటున్నారు.

ఈ వారం కొత్తపలుకులో ఆర్కే ప్రధానంగా ఉద్యోగుల అంశాన్ని ప్రస్తావించలేదు. నీటి సమస్యనే ప్రస్తావించారు. అన్ని బోర్డులను తన పరిధిలోకి తీసుకుంటూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌పై ప్రధానంగా చర్చించారు. రెండు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా నష్టపోబోతున్నారని అంచనా వేశారు. డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ .. ప్రాజెక్టులన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకున్నారని.. ఇప్పుడు ప్రజలు నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.

జల వివాదాలపై ఎక్కువ ఫోకస్ చేసినా… ఆర్కే పలుకులో అంతర్లీనంగా కనిపించే సందేశం ఒక్కటే… అదే ఏపీ అధికారులకు హెచ్చరికలు పంపడం. అడ్డగోలుగా నిధులను మళ్లించడం… రికార్డుల్లో నమోదయి ఉంటుందని.. తర్వాతతప్పించుకోవడానికి కూడా అవకాశం ఉండదని… చెప్పడమే ఆయన ఉద్దేశం రిటైరైనా ఆ అవకతవకలు.. వెలుగులోకి వస్తాయని చెప్పాలనుకుంటున్నారు. ఈ వ్యవహారంలో పాలకులకు ఏమీ కాదు. వారిపై కేసులు పడవు. కానీ అధికారులే అన్నిటా బాధ్యత వహించాలి. అదే సందేశాన్ని ఆర్కే తన ఆర్టికల్ ద్వారా పంపించారని అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కత్తి మహేష్ టెంప్లేట్ వైకాపా వదలదా? కత్తి స్థానాన్ని పోసాని భర్తీ చేయగలరా ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ఆర్సిపి మంత్రులు వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటూ చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది. సినిమా టికెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా అమ్మాలి అన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్...

పోసాని మళ్లీ రచ్చ – దాడికి ప్రయత్నించిన పవన్ ఫ్యాన్స్ !

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరోసారి మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టి "పవన్ నీకెంత...

ప్రజల వరద కష్టాల కన్నా మీడియాకు సినిమా గొడవలే మిన్న !

ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో తుపాన్ బీభత్సం సృష్టించింది. ఏపీలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికీ తేరుకోలేదు. కొన్ని వందల గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఇక నష్టపోయిన వారి గురించిచెప్పాల్సిన...

పంజాబ్ కాంగ్రెస్ చిందర వందర !

అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నించిన కాంగ్రెస్ హైకమాండ్... పంజాబ్ లో పార్టీని చిందర వందర చేసుకుంది. సిద్దూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి అందర్నీ కూల్ చేయాలనుకుంటే చివరికి అదే...

HOT NEWS

[X] Close
[X] Close