ఆర్కే పలుకు : అధికారవ్యతిరేక ఓట్లు చీల్చే వ్యూహంలో కేసీఆర్ !

ప్రభుత్వంపై అధికార వ్యతిరేకత బాగా ఉందని కేసీఆర్‌కు అర్ధమయింది. ఆ వ్యతిరేకత ఒక వైపు వెళ్తే మొత్తానికి మోసం వస్తుంది. అదే రెండు, మూడు వైపులకు తిరిగితే.. బయటపడవచ్చు. కేసీఆర్ ఆలోచన ఇదేనని అందుకే.. బీజేపీని ప్రతిపక్ష పార్టీగా ప్రమోట్ చేస్తున్నారని అంటున్నారు. కొద్ది రోజులుగా జరుగుతున్నా బీజేపీ – టీఆర్ఎస్ యుద్ధంపై ఆయన తనదైన విశ్లేషణ చేశారు. కేసీఆర్ వ్యూహాత్మకంగా బీజేపీకి లేని పోని హైప్ కేటాయించి … ఆ పార్టీకి కాస్త ఊపు తెచ్చే అవకాశం కల్పిస్తున్నారని విశ్లేషించారు. ఎందుకంటే అధికార ఓట్ల చీలిక కోసం అంటున్నారు.

తెలంగాణలో బీజేపీకి క్యాడర్ లేదు. హుజురాబాద్‌లో గెలిచిందంటే ఈటల చేరడం వల్లనే. అంతకు ముందు అక్కడ ఆ పార్టీ కి వెయ్యి ఓట్లు కూడా లేవు. కానీ కాంగ్రెస్ పార్టీకి అలా కాదు. దాదాపుగా ప్రతి గ్రామంలోనూ క్యాడర్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నట్లుగా కనిపిస్తే అది డేంజర్ అవుతుంది. ేవంత్ పీసీసీ చీఫ్ అయిన తర్వాత అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అందుకే కేసీఆర్ వ్యూహం మార్చి బీజేపీని ప్రమోట్ చేస్తున్నారు. త్రిముఖ పోటీ వచ్చేలా చూసుకుంటే ఓట్ల చీలిక అనివార్యమని.. అది టీఆర్ఎస్‌కు లాభిస్తుందనేది కేసీఆర్ ప్లానని ఆర్కే చెబుతున్నారు.

ఇక కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని బయటపడేయడం కష్టమని ఆర్కే చెబుతున్నారు. జగ్గారెడ్డి చేస్తున్న రచ్చ.. రేవంత్ రెడ్డి స్వతంత్రంగా వ్యవహరించే శైలితో ఆ పార్టీ కోలుకోవడం కష్టమని అంచనా వేస్తున్నారు. పరిస్థితి చూస్తే కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందన్నట్లుగానే ఆర్కే రాసుకొచ్చారు. ఇక ఏపీలో పరిస్థితులపైనా ఓ కాలమ్ రాశారు. కానీ కొత్తగా రాసిందేమీ లేదు. చట్టాలను.. రాజ్యాంగాలను పట్టించుకోకుండా పాలన చేస్తున్నారు కాబట్టి… స్వతంత్ర దేశంగా ప్రకటించకుకోవాలని జగన్‌కు ఆర్కే సలహా ఇచ్చేశారు. జగన్‌కు ఓట్లేసినందుకు ఉద్యోగులు సహా ప్రజలు అంతా…, రివర్స్‌లో బాధపడుతున్నారని ఆయన అంచనా వేశారు.

ఆర్కే ప్రతీ వారం ఆర్టికల్‌లో ఓ లాజిక్ ఉంటుంది. ఈ సారి ఆర్టికల్‌లో అలాంటివేమీ కనిపించలేదు. ఏదో ప్రతీ వారం రాయాలి కాబట్టి రాశాం అన్నట్లుగా ఉంది. కొత్త విషయాల ఏమీ చెప్పలేకపోయారు. ముఖ్యంగా ఏపీ విషయంలో ఆయన …చెప్పేవన్నీ దాదాపుగా ప్రతివారం చెప్పేవే ఉంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలోనూ మసీదులు తవ్వుదామంటున్న బండి సంజయ్ !

బండి సంజయ్ ఏ మాత్రం మొహమాటలు పెట్టుకోవడం లేదు. ముందూ వెనుకా ఆలోచించడం లేదు. తన రాజకీయం తాను చేస్తున్నారు. యూపీలో జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని.. తెలంగాణలోనూ అదే వాదన...

అనంతబాబు సస్పెన్షన్ – గౌతంరెడ్డిని చేసినట్లుగానేనా!?

ఎమ్మెల్సీ అనంతబాబును చేయలేక.. చేయలేక సస్పెండ్ చేశారు వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతలు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే నిజంగానే సస్పెండ్ చేశారో లేకపోతే.. గతంలో వంగవీటి రంగాపై...

మా పార్టీ నేతలపై దాడులు చేసుకుంటామా ?: సజ్జల

అమలాపురం దాడుల వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందన్న తీవ్ర ఆరోపణలు వస్తూండటంతో ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. విపక్షాల విమర్శలు చూస్తుంటే... నవ్వొస్తుంది... అధికార పార్టీ నేతలప ఇళ్లపై...

మళ్లీ జగన్‌ను దారుణంగా అవమానించిన టీఆర్ఎస్ మంత్రి !

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అయి... తమ మధ్య మంచి ర్యాపో ఉందని నిరూపిస్తూంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close