ఆర్కే పలుకు : ఉన్మాదులు తయారయ్యారు !

ఓ వ్యక్తి ఏడుస్తూంటే సంతోషించే వారిని ఏమంటారు ?. ఉన్మాదులనే అంటారు. ఈ ఉన్మాదులను ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోని ఓ వర్గం పెంచేస్తోందని.. కనీస మానవ విలువలు, కుటుంబ విలువలు కూడా తెలియకుండా చేసి రాజకీయంగా దారుణమైన పరిస్థితిని తీసుకొచ్చేసిందని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే విశ్లేషించారు. ప్రతీ వారాంతంలో ఆయన రాసే కొత్తపలుకుకు గత వారం విరామం ఇచ్చారు. ఈ సారి కూడా ఆయన రాయకపోయేవారేమో కానీ.. ఏపీ అసెంబ్లీ ఘటన తర్వాత మనసు మార్చుకుని అప్పటికప్పుడు రాసేశారు. ఎన్టీఆర్ కుమార్తె అయిన భువనేశ్వరికి .. పవిత్రమైన అసెంబ్లీలో జరిగిన అవమానం ఆయనను బాధ పెట్టినట్లుగానే రాశారు.

అయితే చంద్రబాబు ఏడుస్తూంటే సంతోషపడిన వాళ్లు ఇంకా చెప్పాలంటే ఆయనకు అలా జరగాల్సిందే అని అనే వాళ్ల పట్ల ఆర్కే జాలి చూపారు. ఏపీలో పడిపోతున్న కుటుంబ బంధాలకు ఇది సాక్ష్యమని ఆయన చెబుతున్నారు. చంద్రబాబుపై వ్యాఖ్యలను సమర్థించేవారు తమ కుటుంబ సభ్యులపైనా అదే అభిప్రాయంతో ఉంటారని ఆయన చెబుతున్నారు. ఇలాంటి సైకోల్ని పెంచి రాజకీయంగా లబ్ది పొందుతున్న వారి వల్ల ఏపీ సమాజం నైతికంగా కూడా దిగజారిపోయిందని తన ఆర్టికల్‌లో అంతర్గతంగా ఆర్కే విశ్లేషించారు.

చంద్రబాబు మహా అయితే ఓ ఎన్నికల్లో మాత్రమే పాల్గొనగలరని.. తర్వాత ఆయన వయసు సహకరిస్తుందో లేదో తెలియదని ఇంతోటి దానికి ఆయనపై మానసిక దాడులు చేయడం ఏమిటని ఆర్కే ఆశ్చర్యపోయారు. సీఎం జగన్మోహన్ రెడ్డిది అత్యంత ప్రమాదకరమైన మైండ్ సెట్ అని.. దానికి ప్రజలు కూడా బలవ్వాల్సింేనని ఆయన పరోక్షంగా తేల్చి చెప్పారు. ఆయన కుటుంబంలో ఆయనే చిచ్చు పెట్టుకుని తన రాజకీయాల కోసం తల్లీ, చెల్లిని దూరం చేసుకుని.. దానికీ చంద్రబాబునే నిందించడం అంటే ఎంత దారుణమైన మైండ్‌తో జగన్ ఉన్నాడో అర్థం చేసుకోవచ్చంటున్నారు.

వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికీ అవినాష్ రెడ్డిని వెనకేసుకు వచ్చేందుకు ప్రయత్నించడం.. ఓ ముఖ్యమంత్రిగా ఎంపీకి సంబంధంలేదని ప్రకటించడం దర్యాప్తును ఖచ్చితంగా ప్రభావితం చేసేదని తెలిసే జగన్ వ్యాఖ్యలు చేశారన్నారు. దేశంలోనే అత్యంత దారుణమైన మానసిక స్థితి ఉన్న జగన్ ద్వారా ఏపీలో మరిన్ని దారుణాలు చూడబోతున్నామని ఆయన చెప్పకనే చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పరామర్శలతో బాధితులకు భరోసా వస్తుందా !?

సొంత జిల్లా ప్రజలు అతలాకుతలమైపోయినా సీఎం జగన్ పట్టించుకోలేని తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న తర్వాత రెండు రోజుల పాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. తిరుపతి, కడపతో పాటు నెల్లూరు జిల్లాలోనూ పర్యటించారు....

ఆ గోరు ముద్దలు జగనన్నవి కావట !

జగనన్న గోరు ముద్ద, జగనన్న పాలు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ అంటూ .. అంగన్‌వాడీ పిల్లలకు ఇస్తున్న ఆహారానికి పబ్లిసిటీ చేసుకుంటున్న ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తక్షణం...

టికెట్ రేట్లు తగ్గించే ఆలోచన లేదు : మంత్రి తలసాని

తెలంగాణ ప్రభుత్వానికి సినిమా టికెట్‌ ధరలు తగ్గించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి లేదని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులతో...

ఏపీ ఉద్యోగ సంఘ నేతలను వ్యూహాత్మకంగా అవమానిస్తున్నారా !?

ముఖ్యమంత్రి జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన కావాలనే ఉద్యోగుల్ని, ఉద్యోగ సంఘ నేతల్ని తీవ్రంగా అవమానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఉన్నారు. పీఆర్సీ కోసం అదే పనిగా పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలతో...

HOT NEWS

[X] Close
[X] Close