ఆర్కే పలుకు : న్యాయవ్యవస్థకు ప్రశ్నలు !

ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఈ సారి న్యాయవ్యవస్థపై కనిపించని అసహనం వ్యక్తం చేశారు. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను పేదలకు సెంటు స్థలాలుగా పంపిణీ చేయవచ్చంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును తప్పు పట్టారు. అంతకు ముందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఇచ్చిన తీర్పును గుర్తు చేసిన ఆయన రెండు పరస్పర విరుద్ధ తీర్పులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రైతులు ఇచ్చిన భూములపై ధర్డ్ పార్టీలకు హక్కులు కల్పించడం సాధ్యం కాదని గతంలో తీర్పులు ఇచ్చారు. ఇప్పుడు సెంట్ బూమి పేరుతో పంచుతున్నారు. ఇది ధర్డ్ పార్టీకి కేటాయించడేమ. తీర్పును ఉ్లలంఘిస్తున్నారని స్పష్టంగా కనిపిస్తున్నా.. అనుకూలంగా తీర్పు ఇవ్వడమేమిటనేది ఆర్కే ప్రశ్న.

అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఇచ్చిన తీర్పువిషయంలో అందరికీ వచ్చిన డౌట్ ఇదే. భూములు ఇచ్చిన రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక్క హామీని నెరవేర్చని ప్రభుత్వం ఆ భూముల్నిసెంటు స్థలాలుగా పంపిణీ చేయడానికి ఎలా అంగీకరిస్తారు ? అది ప్రభుత్వ భూమి అన్న బొత్సపైనా మండిపడ్డారు. రూపాయి కూడా పరిహారం తీసుకోకుండా భూములు ఇచ్చిన రైతులకు అన్ని పరిహారాలు, హామీలు నెరవేర్చిన తర్వాతే ప్రభుత్వ భూమి అవుతుందని గుర్తు చేశారు. అయితే ఆర్కే ధైర్యంగా తీర్పును ప్రశ్నించారు. పేదలకు సెంటు భూముల పేరుతో జగన్ చేస్తున్న రాజకీయం గురించి అందరికీ తెలుసు. పేదల్ని బలపెట్టి తాను రాజకీయ గేమ్ ఆడుతున్నారని ఆర్కే చెబుతున్నారు.

సుప్రీంకోర్టు అది నిబంధనకు విరుద్దమని చెబితే.. స్థలాలివ్వకుండా చేశారని అది అందరి రాజధాని కాదని ప్రచారం చేస్తారు. ఒక వేళ సుప్రీంకోర్టు కూడా అనుమతిస్తే రాజధాని నిర్వీర్యం అయిపోయింది. పేదల్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి రాజకీయం చేస్తున్న జగన్ పై ఆర్కే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పడిపోయే ప్రభుత్వానికి ఎందుకింత పిచ్చి అని కూడా ప్రశ్నిస్తున్నారు. పవన్, చంద్రబాబు పొత్తులు ఖాయమని తేలిన తర్వాత ప్రకటనలు చేస్తున్న వారిని ఆర్కే తీతువు పిట్టలతో పోల్చి అపహాస్యం చేశారు.

అయితే జగన్ ను టార్గెట్ చేసేందుకు ఎలాంటి అవకాశాల్నీ వదిలి పెట్టడానికి ఆసక్తి చూపని ఆర్కే.. కర్ణాటక ఫలితాలను కూడా వాడుకున్నారు. బీజేపీ ఆకర్షణ శక్తి కరిగిపోతోందని. జగన్ లాంటి అవినీతి పరుల్ని దగ్గరకు తీస్తే అంత కంటే దారుణ ఫలితాలు ఉంటాయని.. ఆయనసంగతి చూడాలని పరోక్ష సందేశం పంపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నన్ను ఓ పావుగా వాడుకుంటున్నారు: పూనమ్ కౌర్ ఆవేదన

నటి పూనమ్ కౌర్ ఈమధ్య కాలంలో చేసిన ట్వీట్స్ వైరల్ అయ్యాయి. రాజకీయ దుమారం రేపాయి. పూనమ్ ఓ పార్టీలో చేరబోతుందని, ఆ పార్టీకి అనుకూలమైన ట్వీట్స్ చేస్తోందని కొన్ని కథనాలు వచ్చాయి....

మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ మెన్షన్ !

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, రిమాండ్ కు తరలించారని.. రిమాండ్ ను కొట్టి వేయాలని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ ను మంగళవారం ధర్మాసనం ముందు...

ప్ర‌వీణ్ స‌త్తారు… మిష‌న్ త‌షాఫి!

చంద‌మామ క‌థ‌లు, గ‌రుడ‌వేగ చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌వీణ్ స‌త్తారు. ఆయ‌న్నుంచి వ‌చ్చిన ఘోస్ట్, గాండీవ‌ధారి అర్జున నిరాశ ప‌రిచాయి. ఇప్పుడు ఆయ‌న‌.. ఓ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. అదే.. మిష‌న్ త‌షాఫీ....

ఈవారం బాక్సాఫీస్‌: ముక్కోణ‌పు పోటీ

గ‌త‌వారం బాక్సాఫీసు కొత్త సినిమాల్లేక వెల‌వెల‌పోయింది. `స‌ప్త సాగ‌రాలు దాటి` అనే ఓ డబ్బింగ్ సినిమా వ‌చ్చింది కానీ, ఎలాంటి ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. ఈసారి... ఏకంగా మూడు క్రేజీ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close