ఆర్కే పలుకు : బీజేపీతో కాదు కాంగ్రెస్‌తో టీఆర్ఎస్‌ పొత్తు..!

రాజకీయ విశ్లేషణలు చేయడంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ శైలి వేరు. ఎవరూ ఊహించని విషయాలను ఆయన తన వారంతాపు ఆర్టికల్ కొత్తపలుకు ద్వారా అప్పుడప్పుడూ బయట పెడుతూ ఉంటారు. అలాగే ఈ వారం తెలంగాణ రాజకీయాలపై నిశితమైన విశ్లేషణ చేశారు. అందరూ అనుకుంటున్నట్లుగా కేసీఆర్.. బీజేపీతో మైత్రీ కోసం వెంపర్లాడటం లేదు. ఆ పార్టీతో కలవాలనుకోవడం లేదని ఆర్కే చెబుతున్నారు. ఆ పార్టీ ఎదుగుదలను నియంత్రించడానికి.. తన పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు లేకుండా చూసుకోడానికి ఓ ప్లాన్ ప్రకారం… ప్రజల్లో… లోకల్ బీజేపీ నేతల్లో అపోహలు కల్పిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాలను పరిశీలిస్తే ఆర్కే చెప్పిన దాంట్లో నిజం ఉందని అనిపించక తప్పదు.

కేసీఆర్‌ను ఆర్కే… మొదటి నుంచి చూస్తున్నారు. మొదటి నుంచి అంటే.. కేసీఆర్ మొదటి సారి ఎమ్మెల్యే అయినప్పటి నుండి చూస్తున్నారు. ఆయన మనస్థత్వం..రాజకీయంపై పూర్తి అవగాహన ఉంది. అందుకే.. ఆర్కే చాలా వివరంగా ఈ వారం ఆర్టికల్‌లో కేసీఆర్ ఎంత ప్లాన్డ్‌గా బీజేపీని బద్నాం చేస్తున్నారో చెప్పుకొచ్చారు. కారణాలు ఏమైనా కానీ.. బీజేపీ ఎదుగుదలకు సహకరించింది కేసీఆర్. ఇప్పుడు అది తన సీటు కిందకు నీళ్లు తేకుండా ఉండాలంటే… కాంగ్రెస్‌ను బలపర్చాలని నిర్ణయించుకున్నారట. అందుకే.. నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో జానారెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరపున గెలిపించాలని నిర్ణయించారట. బీజేపీలో చేరాలనుకున్న జానారెడ్డికి.. తాము అండగా ఉంటామన్న సమాచారం పంపి.. కాంగ్రెస్‌లోనే ఉంచేలా చేయడంలో టీఆర్ఎస్ పాత్ర ఉందని ఆర్కే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవచ‌్చని కూడా ఆర్కే విశ్లేషిస్తున్నారు.

కేసీఆర్ వ్యూహం బీజేపీ నేతలకు అర్థం కాక.. కొద్ది రోజులు.. సాఫ్ట్‌గా స్పందించడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు.. బండి సంజయ్ ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌తో క్లారిటీ తీసుకుని బుద్ది, సిగ్గు ఉన్న వాళ్లెవరూ టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోరనే ఘాటు ప్రకటనలు చేస్తున్నారు. అంటే… టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డబుల్ గేమ్ ఆడుతున్నారన్న విషయం బీజేపీ నేతలకూ అర్థమయిందని ఆర్కే.. తన వ్యాసంలో క్లారిటీ ఇచ్చారు. ఒక వేళ కేసీఆర్‌కు.. నిజంగా బీజేపీని బద్నాం చేయాలని లేదని.. ఆ పార్టీతో స్నేహం చేయాలని అనుకుంటూంటే…దాన్ని చెడగొట్టి.. ఇద్దరి మధ్య అపోహలు రేపడానికి ఆర్కే ఈ ఆర్టికల్ ద్వారా ప్రయత్నించినట్లుగా భావించాల్సి ఉంటుంది.

ఇక ఆంధ్రప్రదేశ్ అంశాన్ని కూడా ఈ వారం ఆర్కే ప్రస్తావించారు. కోర్టు తీర్పులకు కులాలను అంటగడుతున్న వైనంపై ఆయనస్పందించారు. అయితే.. అమరావతి రైతుల తరపున వాదించకుండా ఉండేందుకు ఢఇల్లీ ప్రముఖ న్యాయవాదులు… కోట్లకు కోట్లు క్యాష్ ఇస్తున్న విషయాన్ని ఆయన వెల్లడించడం కాస్త హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది. ఎవరైనా మా తరపున వాదించండి అని డబ్బులిస్తారు. కానీ ఎదుటివాళ్ల తరపున వాదించకండి అని కూడా డబ్బులిచ్చే వ్యూహం… జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారనేకొత్త విషయాన్ని ఆర్కే వెల్లడించారు. దీంట్లో నిజం ఎంత ఉందో… న్యాయవాద వర్గాలకే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పరీక్షలు పరీక్షలే..! మోడీ మాట కాదు.. జగన్ బాట..!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ చొరవతో సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. ఇంటర్ పరీక్షల్ని అంటే పన్నెండో తరగతి పరీక్షల్ని వాయిదా వేసింది. మోడీనే అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత మనం మాత్రం...

ప్రశ్నలన్నీ వైఎస్ విజయలక్ష్మికే..!

వైసీపీ గౌరవాధ్యక్షురాలికి కాలం అంతగా కలసి రావడం లేదు. వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉండి.. మరో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంటే.. తాజాగా షర్మిలపై తెలంగాణ పోలీసులు...

తెలంగాణలో “గుర్తు”ను కోల్పోయిన జనసేన..!

జనసేన పార్టీకి.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఏదీ కలసి రావడం లేదు. బీజేపీతో స్నేహం కోసం గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో తెలంగాణలో జనసేన పార్టీ తన...

మోడీ ఎడాపెడా అడిగేస్తున్న జగన్..!

టీకా ఉత్సవ్ అంటూ.. ఉత్సవాలు చేస్తున్నారు కానీ.. టీకాలు మాత్రం కావాల్సినన్ని పంపడం లేదని కేంద్రం వైఫల్యాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజల ముందు పెడుతున్నారు. గత...

HOT NEWS

[X] Close
[X] Close