మొత్తం మెగా ఫ్యామిలీ అంటూ రోజా అనుచిత వ్యాఖ్యలు !

ఏపీ మంత్రి రోజా ఇటీవల తన కుటుంబాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఏడ్చారు. కానీ ఇప్పుడు ఆమె మెగా కుటుంబం అంటూ చిరంజీవి కుటుంబం మొత్తాన్ని దారుణంగా కించ పరుస్తూ మాట్లాడుతున్నారు. మెగా కుటుంబం అంటే అసలు ఎవరికీ సాయం చేయని కుటుంబమని.. అందుకే ముగ్గురూ సొంత జిల్లాలో ఓడిపోయారని ఆమె విమర్శించారు. రోజా వ్యాఖ్యలు ఇప్పుడు మెగా అభిమానుల్లో కలకలం రేపుతున్నాయి. రాజకీయంగా వివాదాలుంటే పవన్ కల్యాణ్ ను విమర్శించవచ్చు కానీ.. చిరంజీవి ఎందుకు ఈ అంశంలో లాగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రోజా మాటలు మామూలుగానే దారుణంగా ఉంటాయి. ఓ మహిళ మాట్లాడే మాటలు కానట్లుగా ఉంటాయి. ఆమె మాట తీరుపై ఎంత దారుణమైన విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గరు. కొనసాగిస్తూనే ఉంటారు. వ్యక్తుల్ని విమర్శించడం.. తిట్లు అందుకోవడంతో పాటు ఇప్పుడు నేరుగా కుటుంబాలను టార్గెట్ చేయడం కలకలం రేపుతోంది. నిజానికి చిరంజీవి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన ఎవర్నీ నొప్పించేలా ప్రకటనలు చేయడం లేదు. వైసీపీ నేతలు గౌరవిస్తే తానూ గౌరవిస్తున్నారు. ఇటీవల రోజా కూడా మంత్రి పదవి వచ్చిన తర్వాత చిరంజీవి దగ్గరకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు.

ఇలాంటి అంశాలను మర్చిపోయి ఇప్పుడు రోజా చిరంజీవిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేగుతోంది. పవన్ కల్యాణ్ .. కోట్ల రూపాయల్ని ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా చేయలేని పనిని చేస్తున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా మాత్రమే కాదు ఇటీవల కరోనా కాలంలో ఎంతో మందిని ఆయన ఆదుకున్నారు. ఇన్ని చేస్తున్నా.. రాజకీయాల్లో ఓటముల్ని చూపించి రోజా కించపర్చడం.. మెగా అభిమానుల్ని అసహనానికి గురి చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

గుంటూరు కారం: త్రీడీలో క‌నిపించిన బీడీ

https://www.youtube.com/watch?v=V-n_w4t9eEU&feature=youtu.be ముందు నుంచీ అనుకొంటున్న‌ట్టే.. మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ సినిమాకి 'గుంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా ఈ రోజు ఫ‌స్ట్ గ్లిమ్స్ విడుద‌ల...

కేశినేనికి దారి తెలీడం లేదా ?

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తనను తాను ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. బెజవాడను తిరుగులేని విధంగా అభివృద్ధి చేశానని.. టాటా ట్రస్ట్ అంటే తనదేనన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇండిపెండెంట్ గా...

‘గుహ’ క‌డుతున్న ప్ర‌భాస్‌

డ్రీమ్ హౌస్‌.. అంటూ ప్ర‌తీ ఒక్క‌రికీ ఉంటుంది. త‌మ ఇల్లు ఎలా ఉండాలో.. ముందు నుంచీ క‌ల‌లు కంటుంటారు. అలాంటి క‌ల ప్ర‌భాస్‌కీ ఉంది. అత్యాధునిక హంగుల‌తో ఓ ఫామ్ హౌస్ నిర్మించుకోవాల‌ని...

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు కేంద్రం కూడా రెడీ !

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఎవరూ ఊహించని విధంగా .. అత్యంత కాస్ట్ లీగా నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది. మరోసారి మన తెలంగాణ .. అనే సెంటిమెంట్ అందరిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close