ఆర్కే పలుకు : వారంలోనే “కొత్తపలుకు” మార్చేసిన ఆర్కే !

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రతీ వారాంతంలో పలికే “కొత్తపలుకు” ఒక్కో సారి సిల్లీగా అనిపిస్తూంటుంది. చాలా సార్లు అవును నిజమే కదా అని అనిపిస్తుంది. ఈ వారం అటు కేటీఆర్ ఇటు జగన్ విషయంలో చేసిన విశ్లేషణలు రెండూ సిల్లీగానే అనిపిస్తాయి. ఇలా కూడా చేస్తారా ? గత అనుభవాలు కళ్ల ముందు ఉన్నా.. ఇలా చేస్తారా అన్న అభిప్రాయం వినిపిస్తోంది.

కేసీఆర్ బీఆర్ఎస్ ఆలోచన చేయడానికి కారణం తెలంగాణలో గెలుపుకోమని ఆర్కే విశ్లేషించారు . ఎలా అంటే తనపై వ్యతిరేకత ఉంది కాబట్టి.. దాన్ని భిన్న మార్గంలో అభిమానంగా మల్చుకోవడానికి తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది తానేనని ప్రజల్లో ముద్ర వేసుకోవడానికి.. మోదీకి ఎదురు నిలబడే వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకుని తెలంగాణ ప్రజల అభిమానాన్ని పొందడానికి ఈ బీఆర్ఎస్ స్కెచ్ వేశారట. ఇదంతా ప్రశాంత్ కిషోర్ కనుసన్నల్లో నడుస్తోంది. గతంలో ఏపీలో జగన్‌ను.. గెలిపించిన వ్యూహమే అమలు చేస్తున్నారంటున్నారు. అయితే తెలంగాణ ప్రజలు భిన్నంగా ఆలోచిస్తారని గత వారం ఇదే ఆర్కే రాసుకొచ్చారు. బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల పేరుతో తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్నారని ఇది ప్రజల్ని ఆగ్రహానికి గురి చేస్తోందన్నారు. గత వారం ఆగ్రహానికి గురి చేసేది.. ఈ వారం ఉండవల్లి లాంటి వాళ్లతో పొడిగించుకున్నంత మాత్రాన ప్లస్ ఎలా అవుతుందో ఆర్కే కన్విన్సింగ్‌గా చెప్పలేకపోయారు. ఇంకా చాలా మందితో సమావేశాలు పెట్టి కేసీఆర్ వీరుడు, శూరుడు అని పొగిడించుకోబోతున్నారని కూడా ఆర్కే చెబుతున్నారు. దాదాపుగా పదేళ్లుగా అధికారంలో ఉన్న సీఎం ప్రజా తీర్పుకు వెళ్తే ప్రజలు.. ఇతరులు చేసే పొగడ్తలతో చూసి ఓటేస్తారా ? పదేళ్ల పాలనను చూసి ఓటేస్తారా ? అనేది ఆర్కే లాజిక్ గా ఆలోచించుకోలేకపోయారనుకోవచ్చు.

ఇక ఏపీ విషయానికి వస్తే ఆర్కే కూడా పవన్ కల్యాణ్ లా గందరగోళంగా ఉన్నారు. గత వారమే జగన్‌పై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నందున మెల్లగా జగన్‌కు బీజేపీ దూరం జరుగుతోందని చెప్పుకొచ్చారు. కానీ ఈ వారం కొత్తపలుకు మాత్రం భిన్నంగా ఉంది. చంద్రబాబు వల్ల బీజేపీకి వచ్చే లాభమేం లేదు కనుక .. పరోక్షంగా అయినా జగన్‌నే సీఎంగా కొనసాగేలా చూడాలనుకుంటోందట. అదే ఇష్టమని.. పవన్‌కూ చెప్పిందట. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అనే ఉద్దేశంలో బీజేపీ ఉందట. మరి జగన్‌పై పెరుగుతున్న ప్రజావ్యతిరేకత విషయంలో బీజేపీ ఎందుకు మనసు మార్చుకుందనే విషయాన్ని ఆర్కే చెప్పలేకపోయారు. కారణం ఏదైనా కావొచ్చు కానీ.. వచ్చే ఎన్నికల్లో పొత్తులు టీడీపీ, జనసేన మధ్య ఉంటే చాలని.. బీజేపీ అక్కర్లేదన్న సందేశాన్ని ఈ వారం ఆర్కే పంపారు. నిన్నటి వరకూ ఇది వేరేగా ఉండేది. బీజేపీ కూడా పొత్తులో ఉంటే.. ఎన్నికల విషయంలో జగన్ చేసే అధికార దుర్వినియోగాన్ని అడ్డుకట్టు వేయవచ్చని ఆయన చెప్పేవారు.

ఆర్కే కొత్తపలుకుల్లో మార్పు సహజంగానే ఉంటుంది కానీ ఇలా ఒక్క వారంలోనే పూర్తి స్థాయిలో మార్పు రావడానికి కారణం ఏమిటన్నది మాత్రం ఆసక్తికరమే. టీడీపీ రాజకీయ వ్యూహాల్లో ఆయన ఇంకా భాగం పంచుకుంటున్నారో.. లేక తన సలహాలు ఇవ్వాలని అనుకుంటున్నారో కానీ… అసువుగా మాట మార్చేస్తున్నారు. కొత్తపలుకుకు విలువ తగ్గించేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సాలు .. సాలంటున్న బీజేపీ, టీఆర్ఎస్ !

సొలు దొర - సెలవు దొర అని బీజేపీ అంటూంటే... సాలు మోదీ.. సంపకు మోదీ అని టీఆర్ఎస్ రివర్స్ కౌంటర్ ఇస్తోంది. తమ పార్టీ ఆఫీస్ ముందు డిజిటల్ బోర్డు...

చివరికి కుప్పానికి విశాల్ రెడ్డిని కూడా పిలుస్తున్నారు !

కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటున్న వైసీపీకి దారి తెలుస్తున్నట్లుగా లేదు. మున్సిపల్ ఎన్నికల్లో చేసినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో చేయలేమని అర్థమైందేమో కానీ ఇప్పుడు సినీ హీరోను చంద్రబాబుపై పోటీకి పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు. తమిళ...

ఏపీలో అధికారులు ఎవరైనా “కథలు” చెప్పాల్సిందే !

దొంగ లెక్కలు రాయడం.. తప్పుడు కథలు చెప్పడం ఇప్పుడు ఏపీ అధికారులకు ఓ కామన్ ప్రాక్టిస్ అయిపోయింది. పోలీసులు వివిధ కేసుల్లో చెప్పిన కథలు వారిని నవ్వుల పాలు చేశాయి. సోషల్...

దర్శి ఎమ్మెల్యే చెప్పుకున్నారు.. మిగతా వాళ్లు మనసులో దాచుకుంటున్నారు !

గడప గడపకూ వెళ్తే ప్రజలు నిలదీస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ కి చెందిన దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్‌సీపీ నియోజకవర్గ ప్లీనరీలో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close