ఆర్కే పలుకు : ఇలా అయితే ప్రజలకు బీపీ రావడం ఖాయం !

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిణామాలపై నేరుగా విశ్లేషించారు. ఆయన తన ఆర్టికల్స్‌లో ఎక్కువగా తెర వెనుక ఏం జరిగిందనే అంశాలను చెప్పేవారు. ఈ సారి అలాంటి వివరాలు ఒక్కటి కూడా చెప్పలేద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులపైనా.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మాత్రం నేరుగానే విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని గొప్ప నటుడిగా అభివర్ణించిన ఆయన.. సానుభూతి కోసం తనను ” లం.. కొడకా ” అన్నారని నేరుగా చెప్పుకోవడాన్ని ఈసడించుకుంటున్నారు. రాజకీయంగా ఉపయోగించుకుని తల్లిని, చెల్లిని రోడ్డు మీద వదిలేసిన జగన్‌ ఇప్పుడు మళ్లీ అవసరం ఏర్పడిందన్నారు.

పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆర్కే నిశితమైన విమర్శలు చేశారు. ప్రజాధనం జీతాలుగా తీసుకుంటూ… కేవలం వైసీపీ కోసమే పని చేస్తున్న పోలీసులు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఎందుకు లేదో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. డీజీపీకి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని స్పష్టం చేశారు. తమపై జరుగుతున్న దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని టీడీపీ నేతలు పదే పదే ప్రకటించడంపై కూడా ఆర్కే ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు రాష్ట్రంలో రాయలసీమలో మాత్రమే కొన్ని చోట్ల ఫ్యాక్షన్ ఉంటుంది కానీ వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రం మొత్తం ఫ్యాక్షన్ జోన్ అయిపోతుందని.. ఇలా అయితే రాష్ట్రం ఏం కావాలని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే పట్టాభి మాట్లాడిన మాటను ఆర్కే మంచి అని అనలేదు. నిర్మోహమాటంగా తప్పు పట్టారు. నిజానికి సీఎం అన్వయించుకున్న ఆ ఆర్థం .. ఆ పదానికి లేదని ఇప్పటికే అనేక రకాల ఉదాహరణలు వస్తున్నాయి. సినిమాల్లో.. పాటల్లో ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నారు. ఎక్కడా సెన్సార్లు చేయలేదు. అయినప్పటికీ ఆ పదం వాడటం తప్పని ఆర్కే తేల్చేశారు. అన్ని చోట్ల కామన్‌గా వాడుతున్నారు కాబట్టే తాను వాడానని పట్టాభి పార్టీ నేతలకు వివరణ ఇచ్చినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రిని పట్టుకుని అలా తిట్టడం ఏమిటని కేటీఆర్ అన్నారని .. మరి బండి సంజయ్‌ని పట్టుకుని మైనంపల్లి హన్మంతరావు తిట్టినప్పుడు కేటీఆర్ ఎందుకు ఖండించలేదని ఆర్కే ప్రశ్నించారు. నిజానికి కేటీఆర్ ఉద్దేశం తమ తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి.. ఆయనపై ఇటీవల చాలా మంది దూషణలకు దిగుతున్నారు కాబట్టి. సీఎంలకు మాత్రమే ఆ ప్రివిలేజ్ ఉండాలన్న ఉద్దేశంతో మాట్లాడి ఉంటారు. ఆర్కే ఈ పాయింట్‌ను క్యాచ్ చేయలేకపోయారు. అంతకు మించి ఆయన మరో విషయం తన దృష్టికి వచ్చినా రాయలేకపోయారనుకోవాలి. అదేమిటంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను .. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు పాదయాత్ర ప్రారంభం రోజున దూషించారు. ఉరేసుకుని చచ్చిపోవాలని తూలనాడారు. ఇది ఆర్కే దృష్టికి రాకుండా పోదు.. కానీ ఇప్పుడు ఏబీఎన్‌కు వైఎస్అర్‌టీపీ నుంచి ప్యాకేజీ అందినట్లుగా ఉందని ఆ చానల్‌లో ఆ పార్టీకి వస్తున్న ప్రసారాలే నిరూపిస్తున్నాయి. అందుకే షర్మిల మాటలను లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌

అబ్దుల్‌క‌లామ్ అంటే ఇట్టే గుర్తు ప‌డ‌తాం కానీ, నంబి నారాయ‌ణ‌న్ పేరు చెబితే మాత్రం ఈయ‌న ఎవ‌ర‌ని అడిగేవాళ్లు చాలామంది. క‌లాం స‌మ‌కాలికుడే నంబి నారాయ‌ణ‌న్‌. అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లో భార‌త కీర్తి...

కింగ్ అవ్వాలనుకుని జోకర్ అయిన ఫడ్నవీస్ !

మహారాష్ట్ర మాజీ సీఎం మొత్తం కథ నడిపి చివరికి జోకర్‌గా మిగిలిపోయారు. ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. మహారాష్ట్ర బీజేపీకి తిరుగులేని నేతగా ఉన్న ఆయన... మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం...

ప్రభుత్వం “మార్గదర్శి చిట్స్” కాదంటున్న సజ్జల !

జీపీఎఫ్ సొమ్మును ఎనిమిది వందల కోట్లు ఆన్ లైన్ ఫ్రాడ్ తరహాలో కొట్టేసిందని ఉద్యోగులు తీవ్ర స్థాయిలో విమర్శలుచేస్తూ..పోలీసు కేసు పెడతామని ఓ వైపు హెచ్చరికలు చేస్తూంటే.. ప్రభుత్వ సలహాదారు సజ్జల మాత్రం...

రివ్యూ: అన్యస్ టుటోరియల్ (ఆహా వెబ్ సిరీస్‌)

హారర్‌ ఎవర్ గ్రీన్ జోనర్‌. భయం కూడా కమర్షియల్ ఎలిమెంటే. బడ్జెట్ విషయంలో కూడా నిర్మాతలకు కలిసొచ్చే జోనర్ ఇది. అందుకే తరచూ హారర్ కంటెంట్ ప్రేక్షకులని పలకరిస్తూనే వుంటుంది. ఓటీటీ ప్రభావం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close