ఆర్కే పలుకు : దమ్ముంటే అరెస్ట్ చేస్కో..!

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని.. పగతో రగిలిపోయే ప్రభుత్వ పెద్దలను మరింత రెచ్చగొడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన వారంతపు ఆర్టికల్ కొత్తపలుకులో ఈ సారి మరింత ఘాటు పెంచారు. దీనికి కారణం… రఘురామకృష్ణరాజు ప్రెస్‌మీట్‌లు ప్రసారం చేసినందుకు తన చానల్‌పైనా రాజద్రోహం కేసు పెట్టడం ఓ కారణం అయితే… ప్రభుత్వ వైద్యులు రఘురామకృష్ణరాజు గాయాల విషయంలో తప్పుడు నివేదికలు ఇచ్చినట్లుగా ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ప్రకటించుకోవడం మరో కారణంగా చెప్పుకోవచ్చు.

రఘురామకృష్ణరాజుతో పాటు టీవీ5, ఏబీఎన్‌లపైనా సీఐడీ పోలీసులు సుమోటోగా రాజద్రోహం కేసులు పెట్టారు. రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసినప్పుడే… మరో రెండు సీఐడీ బృందాలు హైదరాబాద్‌లో ఉన్నాయని.. మీడియా ప్రతినిధుల్ని అరెస్టులు చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఎందుకనో కానీ ఆ సీఐడీ బృందాలు వెనక్కి వెళ్లిపోయాయి.ఆ తర్వాత రఘురామ రాజు కేసులో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఇప్పుడు వేమూరి రాధాకృష్ణ..ఆ కేసు విషయంలో ఫుల్ అడ్వాంటేజ్ తీసుకుని.. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రఘురామరాజు విషయంలో సీఐడీ సునీల్ అత్యుత్సాహం.. పోలీసులు కొట్టిన మాట నిజమని అంతర్గతంగా కూడా అందరికీ తెలిసిపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం ఇరుక్కుపోయిందన్న భావనలో రాధాకృష్ణ ఉన్నట్లుగా కనిపిస్తోంది.

రఘురామకృష్ణరాజు విషయంలో ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి చేసి తప్పుడు నివేదిక ఇప్పించారనే అంశంపై తన వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని… ప్రభుత్వం కేసు పెట్టే ధైర్యం చేస్తుందా అని సవాల్ చేశారు. తన ఆర్టికల్‌లో ఇతర అంశాలపై మాట్లాడినప్పుడు.. ప్రధానంగా… అందరికీ… తప్పుడు నివేదికకు ఆధారాలు అన్న కోణంలోనే ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అందరూ నిండా మునిగిపోయారన్న భావన రాజకీయవర్గాలలో ఉంది. ఇంకా ముందుకు వెళ్తే..వారిని మరింతగా ఫిక్స్ చేయడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఆర్కే… ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మీడియా తీరునూ ఆర్కేతప్పు పట్టారు. రఘురామరాజుకు బెయిల్ వార్తను సరిగ్గా ఇవ్వలేదని ఆక్షేపించారు. అయితే అదే్ విషయంలో… ఆయన చానల్‌… పత్రికపైనా కొన్ని విమర్శలు ఉన్నాయి. అయితే ప్రజలకు ఏది ఆసక్తికరంగా ఉంటుందో ఆ వార్తలు ఇస్తేనే వాటికి మనుగడ ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వానికి గులాములు కొట్టకుండా..ప్రజల తరపునప్రతిపక్షంగా వ్యవహరిస్తేనే మీడియాకు ఆదరణ ఉంటుంది. ఆర్కే చేసిన సవాళ్లను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటే… ఆయనను రేపోమాపో అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయోనన్నది ఇప్పుడు ఆసక్తికరం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హుజురాబాద్‌లో ప్రచారం చేయడానికే కేసీఆర్ మొగ్గు !

ఉపఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో బహిరంగసభలకు అనుమతి లేకపోవడంతో పొరుగు నియోజకవర్గాల్లో భారీ సభ పెట్టాలని అనుకున్నారు టీఆర్ఎస్ నేతలు. ఈ ప్రయత్నాలనూ ఎన్నికల సంఘం అడ్డుకుంది. తాజాగా జారీ చేసిన...

కేంద్రం ఓకే అనకపోతే రూ. పాతిక వేల కోట్లు తిరిగి కట్టాల్సిందే !

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ పేరుతో ఏపీ తీసుకున్న రూ. పాతిక వేల కోట్ల రుణం విషయంలో కేంద్రం అభిప్రాయం చెప్పాలని హైకోర్టు నోటీసుల ుజారీ చేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న...

ఎడిటర్స్ కామెంట్ : ప్రజాస్వామ్య రక్షతి రక్షితః !

" ప్రజాస్వామ్యాన్ని నువ్వు కాపాడితే.. నిన్ను ప్రజాస్వామ్యం కాపాడుతుంది. నువ్వే ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తే ఆ తర్వాత కాపాడటానికి ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది ?". మన దేశంలో రాజకీయ నేతలకు ప్రజాస్వామ్యమే...

బిజినెస్ మొదలెడుతున్న కమల్ హాసన్

కమల్ హసన్ యూనివర్శల్ స్టార్. సినిమానే ప్రాణంగా బతికిన మనిషి. ఆయన సినిమాలు పెద్ద కమర్షియల్ హిట్స్ కాకపొవచ్చు కానీ కళని అభిమానించే వారిని మాత్రం నిరాశపరచవు. నటుడిగా, దర్శుకుడిగా, నిర్మాతగా .....

HOT NEWS

[X] Close
[X] Close