ఆర్కే పలుకు : ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల !

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల ఉంటే ? ఈ ఆలోచన ఇప్పటి వరకూ రాలేదు. ప్రియాంకా గాంధీకి, షర్మిలకు కూడా వచ్చిందో రాలేదో తెలియదు కానీ ఆర్కే మాత్రం తన కొత్త పలుకులో వెల్లడించేశారు. ముందుగా ప్రియాంకా గాంధీకి వచ్చిందని .. ముచ్చట్లు కూడా జరిగాయని ఆయన ఈ వారం కీలక విషయం వెల్లడించారు. డీకే శివకుమార్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న షర్మిల కర్ణాటక ఫలితాల కంటే ముందే ప్రియాంకా గాంధీతో మాట్లాడారంటున్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత శివకుమార్ ను బెంగళూరులో షర్మిల కలిశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం వార్తలొచ్చాయి. వాటిని షర్మిల ఖండించినప్పటికీ.. అలాంటి చాన్స్ లేదని చెప్పలేమన్న అభిప్రాయం గట్టిగానే వినిపిస్తోంది.

ఆర్కే చెప్పినట్లుగా ఏపీలో రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ నిర్వీర్యమైపోలేదు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి స్థానాలు సాధించింది. అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకున్న తర్వాతనే కాంగ్రెస్ నిర్వీర్యమైపోయింది. ఆ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం జగన్ వైపు వెళ్లిపోయింది. ఆ ఓటు బ్యాంక్ మొత్తం పార్టీకి రావాలంటే ఓ నాయకుడు కావాలి. అలాంటి నాయకత్వం షర్మిల ఇస్తుందని ఆర్కే లాజిక్. తెలంగాణ ఎన్నికల తర్వాత ఏదైనా జరగడానికి అవకాశం ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఆర్కే ఈ విషయాలను జనంలోకి పంపడానకి ప్రయత్నించారు.

నిజగా ప్రియాంక, షర్మిల మధ్య చర్చలు జరిగాయో లేదో కానీ జగన్మోహన్ రెడ్డిని తికమక పెట్టి.. షర్మిల కాంగ్రెస్ రూపంలో ఏపీకి వస్తుందేమో అన్న ఆందోళనకు గురి చేసి.. ఆస్తులు ఇప్పించాలన్న ఆ ఓ ఆలోచన ఆర్కే ఆర్టికల్ లో అంతర్గతంగా కనిపిస్తోంది. షర్మిలకు జగన్ దగ్గర నుంచి రావాల్సిన ఆస్తుల గురించి పదే పదే రాస్తున్నారు ఈ మధ్య ఆర్కే. ఇందులోనూ ఆస్తుల ప్రస్తావన తీసుకు వచ్చారు.

తెలంగాణ ఎన్నికల్లో షర్మిల పార్టీ అద్భుతాలు కాదు కదా..అసలు ఉనికి చాటుకుంటుందనే నమ్మకం ఎవరికీ లేదు. పాలేరులో షర్మిలకు డిపాజిట్ వచ్చినా ఆశ్చర్యమే. ఆ తర్వాత తెలంగాణలో చేయడానికి ఏమీ ఉండదని.. ఆమె రాజకీయం అంతా ఏమైనా ఉంటే ఏపీలో ఉంటేనే ఆదరణ ఉంటుందనే అభిప్రాయం ఏర్పడితే.. ఏప్రిల్ లో జరగాల్సిన ఎన్నికల కంటే ముందే .. షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ఆర్కే కూడా అదే చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో 32 స్థానాల్లో జనసేన పోటీ !

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ మరో వారంలో వచ్చే అవకాశం ఉండటంతో జనసేన పార్టీ కూడా రెడీ అయిపోయింది. బలం ఉన్న చోటే పోటీ చేస్తామని గతంలో పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆ మేరకు...

ఒక ఆదర్శ ముఖ్యమంత్రిని ఇంత అన్యాయంగా అరెస్ట్ చేస్తారా ?!

''74 సంవత్సరాలు ఉన్న ఒక ఆదర్శ ముఖ్యమంత్రిని ఇంత అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం దుర్మార్గం'' అన్నారు సీనియర్ నటుడు మురళీ మోహన్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పై కాస్త...

‘అన్నాయ్‌..’ ఆశ‌లు పోయినాయ్‌!

శ్రీ‌కాంత్ అడ్డాల డ్రీమ్ ప్రాజెక్ట్ `అన్నాయ్‌`. ఇద్ద‌రు స్టార్ హీరోలతో మ‌ల్టీస్టార‌ర్ సినిమాగా తీర్చిదిద్దాల‌న్న‌ది త‌న ప్ర‌య‌త్నం. క‌థ కూడా రెడీ. గీతా ఆర్ట్స్ లో ఈ క‌థ వినిపించారాయ‌న‌. కాక‌పోతే.. బ్ర‌హ్మోత్స‌వం...

అప్పుడు చెల్లాయి.. ఇప్పుడు అమ్మాయి

'వీరసింహరెడ్డి'లో సిస్టర్ ఎమోషన్ ని బలంగా నమ్మాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. సినిమాకి ప్రధాన ఆకర్షణగా వున్న పెద్ద బాలయ్య పాత్రని ఇంటర్వెల్ లోనే ముగించి చాలా పెద్ద సాహసమే చేశారు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close