ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే చాలా గత నాలుగైదు వారాలుగా వస్తున్న కొత్తపలుకులను చూస్తే.. కేవలం కేసీఆర్ రాజకీయంగా వేస్తున్న అడుగులపై ఆయన ఆలోచలను ప్రభావితం చేయడానికి తన వంతుగా ప్రయత్నం చేస్తున్నారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఈ వారం కూడా అంతే.. మునుగోడులో ఉపఎన్నిక తర్వాత టీఆర్ఎస్కు తెలంగాణలో పాజిటివ్ ఉందని ఆయన చెప్పడానికి మనస్కరించలేదు. అలా లేదని అనుకున్నా.. ఆయన కనీసం అభినందించలేదు.. దుబ్బాక, హుజూరాబాద్‌లలో తప్పులు చేశారని.. వాటిని చేయకుండా మునుగోడులో గెలిచారని చెప్పుకొచ్చారు. అది జర్నలిస్టులుగా ఆయన అభిప్రాయం అనుకున్నా.. కేసీఆర్ తదుపరి అడుగులపై మాత్రం.. ఆయనను వెనక్కి లాగేలా కామెంట్లు చేశారు.
కేసీఆర్ .. ఫామ్ హౌస్ డీల్స్ కేసులో సిట్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారని కేంద్రం.. కౌంటర్‌గా ఈడీ, ఐటీలను రంగంలోకి దిగింపని.. రెండు హోరాహోరీగా తలపడటం వల్ల తెలంగాణ ఆగమైపోతోందనేది ఆర్కే వాదన. ఇప్పుడు హైదరాబాద్‌కు వరదలా పెట్టుబడులు వస్తున్నాయని.. కేంద్ర, రాష్ట్రాల పోరాటం వల్ల పెట్టుబడిదారులు వెనక్కి పోతారని అంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి., పార్టీని మార్పు చేసుకుని…ఎందుకు రిస్క్ తీసుకుంటున్నారో ఆర్థం కావడం లేదని ఆర్కే బాధపడ్డారు.
అదే సమయంలో బీజేపీ మరింతగా ఎజెండా ముందుకు తెస్తుందని.. అలా తేవొద్దని కూడా సలహాలిచ్చారు. ఉత్తరాది వేరు.. దక్షిణాదివేరు అని చెప్పుకొచ్చారు. ఇలా ఎందుకు చెప్పారంటే.. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని సలహా ఇవ్వడం కోసం. టీ టీడీపీని రాజీనామా చేసి వెళ్లిపోయిన కొందరు.. మళ్లీ ఆ పార్టీలో చేరాలనుకుంటున్నారని.. కొంత మంది ముఖ్య నేతలు కూడా చేరిపోవడానికి సిద్ధమయ్యారని ఆర్కే చెబుతున్నారు. టీఆర్ఎస్ కమ్యూనిస్టులతో కలిసినందున… బీజేపీ.. టీడీపీతో కలిస్తే తప్పేం లేదని ఆయన వాదన వినిపించారు.
మొత్తంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లకూడదన్న సలహానే ప్రతీ వారం … కేసీఆర్‌కు ఆర్కే ఇస్తున్నారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా అదే చెబుతున్నారు. ఎందుకు ఇలా కేసీఆర్‌ను ఆర్కే వెనక్కి లాగాలనుకుంటున్నారో క్లారిటీ లేదు కానీ.. అన్నింటికీ సిద్ధపడే తాను రెడీ అయినట్లుగా కేసీఆర్ ప్రకటించారు. మరి ఆర్కే ఎందుకు ఆయన నిర్ణయాన్ని మార్చాలనుకుంటున్నారో ?