ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల చరిత్రలో మంత్రి నారా లోకేష్ మరో చారిత్రాత్మక విజయం సాధించారు. దావోస్ వేదికగా ఆయన జరిపిన మెరుపు వేగపు చర్చలు ఫలించి, ప్రముఖ మౌలిక సదుపాయాల దిగ్గజం ఆర్ఎంజడ్ ఏపీలో ఏకంగా రూ. లక్ష కోట్ల భారీ పెట్టుబడి ప్రతిపాదనను ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా ఐటీ, డేటా సెంటర్ల రంగాల్లో రాబోయే ఐదేళ్లలో సుమారు లక్ష మంది యువతకు ఉపాధి లభించనుంది.
విశాఖపట్నం కేంద్రంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ హబ్‌ను నిర్మించాలన్న లోకేష్ సంకల్పానికి ఈ ప్రాజెక్టు వెన్నెముకగా నిలవనుంది. విశాఖ కాపులుప్పాడలో 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ GCC పార్క్ తో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరాల కోసం 1 గిగావాట్ సామర్థ్యం గల అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం కాకుండా, రాయలసీమలో 1,000 ఎకరాల్లో లాజిస్టిక్స్ పార్కును కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అంతర్జాతీయ పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోంది. సింగిల్ విండో అనుమతులు, పారదర్శకమైన పాలనపై ఇస్తున్న భరోసాతో గ్లోబల్ కంపెనీలు ఏపీ వైపు క్యూ కడుతున్నాయి.
