బాహుబలి 2 తరవాత అందటి క్రేజీ ప్రాజెక్ట్ శంకర్ రోబో 2.0దే. దాదాపుగా రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. మనదేశంలో ఓ సినిమా కోసం పెడుతున్న అత్యధిక బడ్జెట్ ఇదే. టాలీవుడ్లో దాదాపుగా రూ.50 కోట్ల మార్కెట్ చేయాలని శంకర్ అండ్ టీమ్ భావిస్తోంది. అందుకోసం ఓ టాలీవుడ్ హీరో సహాయ సహకారాలు తీసుకోవాలన్నది శంకర్ ప్లాన్. రోబో 2.0లో గెస్ట్ హీరోగా ఓ తెలుగు స్టార్ కనిపిస్తాడన్న ప్రచారం మొదలైంది. అప్పటి నుంచీ ఆ హీరో ఎవరా? అంటూ ఆరా తీస్తున్నారు సినీ అభిమానులు. ఆ ఛాన్స్ ముగ్గురు హీరోలకు ఉందని ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్‌లలో ఎవరో ఒకరు గెస్ట్‌గా కనిపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ ముగ్గురు హీరోలకు దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉంది. వాళ్లుంటే.. టాలీవుడ్లో కనీసం ఈ సినిమా రూ.50 కోట్లు వసూలు చేస్తోందని, అతని తన సినిమా కలక్షన్లలో పెద్ద మార్జిన్ అని శంకర్ భావిస్తున్నాడు.
శంకర్ ఇది వరకటి చిత్రాలు శివాజీ, రోబో, ఐ తెలుగులో మంచి మార్కెట్ చేసుకొన్నాయి. అంతకు రెండు మూడింతలు ఈ సినిమా ద్వారా రాబట్టాలన్నది శంకర్ వ్యూహం. ఈ ముగ్గురిలో ఒకర్ని శంకర్ సంప్రదించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కేవలం రెండు మూడు రోజుల కాల్షీట్లు సరిపోతాయని, శంకర్ అడిగితే ఏ హీరో అయినా ఒప్పుకొంటాడని చిత్రబృందం భావిస్తోంది. మరి ఈ ముగ్గురిలో రజనీకాంత్ పక్కన కనిపించే అవకాశం ఎవరికి వస్తుందో చూడాలి. మరోవైపు రోబో 2.0 హక్కుల కోసం టాలీవుడ్లో పోటీ మొదలైపోయింది. ముగ్గురు బడా నిర్మాతలు తెలుగు రైట్స్ కోసం చెన్నైలో పాగా వేశారని, త్వరలోనే తెలుగు నిర్మాత కూడా ఖరారైపోయే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే… తెలుగులో గెస్ట్ రోల్ ఎవరు చేస్తారో తెలిస్తే.. అప్పుడు రేటు మరింత పెరిగే అవకాశాలున్నాయని తమిళ నిర్మాతలు భావిస్తున్నార్ట. హీరో ఫిక్సయ్యాకే తెలుగు రేటునీ ఫిక్స్ చేస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.