దేశవ్యాప్తంగా రోహిత్ ఆత్మహత్య ఘటన ప్రకంపనలు

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య వివాదం తీవ్రరూపు దాలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చనిపోయిన విద్యార్థి దళితుడు కావటంతో దళిత సంఘాలు ఈ ఘటనపై మండిపడుతున్నాయి. ఒక వైపు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌పై కేసు నమోదు కాగా మరోవైపు ఢిల్లీలో కేంద్ర మానవవనరుల మంత్రి కార్యాలయంవద్ద కూడా దళిత విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది.

సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ స్నేహితులు ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి రాసిన లేఖ వల్లే రోహిత్ మృతి చెెందాడని ఆరోపించారు. ఆ లేఖ వల్లే వీసీ అప్పారావు ఐదుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారని పేర్కొన్నారు. దత్తాత్రేయను ఏ 1గా, అప్పారావు ఏ 2గా, ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ ఏ 3గా, అతని సోదరుడు విష్ణును ఏ 4గా సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు రోహిత్ ఆత్మహత్య కేసు సెగ ఢిల్లీకి తాకింది. ఢిల్లీలోని జవహర్‌లాల్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలకు చెందిన దళిత విద్యార్థులు కేంద్ర మానవవనరుల మంత్రి కార్యాలయం ఎదుట, మంత్రి స్మృతి ఇరాని నివాసం ఎదుట ధర్నాకు దిగారు. విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావటంతో పరిస్థితిని అదుపు చేయటానికి పోలీసులు వాటర్ కేనన్‌లను ఉపయోగించాల్సివచ్చింది. అయినా విద్యార్థులు వెనక్కు తగ్గలేదు. ఆందోళన ఇంకా కొనసాగుతోంది. ఈ ఘటనపై విచారణకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ బృందం ఇవాళ హైదరాబాద్ వచ్చి విచారణ జరిపి రేపటికల్లా నివేదికను సమర్పిస్తుంది.

కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఈ ఘటనపై స్పందిస్తూ, తాను రాసిన లేఖకు, రోహిత్ ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. యూనివర్సిటీలో అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయని, చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ విద్యార్థులు కొందరు తనకు వినతిపత్రం ఇచ్చారని, దానినే తాను కేంద్ర మానవవనరుల మంత్రికి ఫార్వార్డ్ చేశానని చెప్పారు. ప్రజా గాయకుడు గద్దర్ ఈ ఘటన ఇవాళ రోహిత్ మృతదేహానికి నివాళులు అర్పించటానికి యూనివర్సిటీకి వెళ్ళగా పోలీసులు అడ్డుకుని ఆయనను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని గద్దర్ డిమాండ్ చేశారు. దళిత విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన వీసీపై చర్యలు తీసుకోవాలని అన్నారు. నిజమాబాద్ ఎంపీ కవిత స్పందిస్తూ, కేంద్రమంత్రి దత్తాత్రేయ దిగజారి విద్యార్థుల రాజకీయాల్లో తల దూర్చారని విమర్శించారు. దత్తాత్రేయ, స్మృతి ఇరానీ ఒత్తిడి మేరకే వీసీ విద్యార్థులపై సస్పెన్షన్ విధించారని ఆరోపించారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి తమ జాగృతి సంస్థ అండగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికైనా సస్పెన్షన్‌కు గురైన మిగిలిన నలుగురు విద్యార్థులపై ఆ సస్పెన్షన్‌ను ఎత్తేయాలని డిమాండ్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close