రోజా రూటే వేరు ..! పార్టీలో కోవర్టులుంటే పోలీసులు ఏం చేస్తారు ?

పోలీసులు ఎందుకు ఉన్నారు ? శాంతిభద్రతల్ని రక్షించడానికి. ఇది అధికారికం. ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే వైసీపీ కోసం పని చేయడానికి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇలా వైసీపీ కోసం పని చేయడాన్ని పోలీసులు బహిరంగంగా చేయరు. విధి నిర్వహణలో భాగంగానే చేస్తున్నాంటారు. అలాగే ఉంటుంది కూడా. అయితే ఈ నగరి ఎమ్మెల్యే రోజాకు ఈ తేడా అర్థం అయినట్లుగా లేదు.

నేరుగా పోలీస్ స్టేషన్‌కు .. అదీ కూడా ఎస్పీ ఆఫీస్‌కు వెళ్లి… తన నియోజకవర్గంలో వైసీపీ కోవర్టులున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసేశారు. చిత్తూరు ఎస్పి సెంధిల్‌కుమార్ కి నగిరి‌ ఎమ్మెల్యే ఆర్.కే.రోజా కలిసి విననతి‌ పత్రం అందించారు.. కొంత మంది వైసీపీ నేతలు వైసీపిలో ఉంటూ టిడిపితో జత కలిశారని వారిని ఉపేక్షించేది‌ లేదన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో‌ ఫోటోలు వేసుకుని ఫ్లేక్సీలు వేసుకుని అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు..

గతంలో వైసీపిలో సస్పెండ్ అయిన వారు వైసీపి పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నారని, వీరిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎస్పి సెంధిల్ కుమార్ కి ఫీర్యాదు చేసినట్లు ఆర్.కే.రోజా‌ తెలియజేశారు. పార్టీలో ఏమైనా గొడవలు ఉంటే.. పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తారు కానీ ఇలారోజా పోలీసులకుఫిర్యాదు చేయడం ఏమిటని వైసీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

గుంటూరు కారం: త్రీడీలో క‌నిపించిన బీడీ

https://www.youtube.com/watch?v=V-n_w4t9eEU&feature=youtu.be ముందు నుంచీ అనుకొంటున్న‌ట్టే.. మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ సినిమాకి 'గుంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా ఈ రోజు ఫ‌స్ట్ గ్లిమ్స్ విడుద‌ల...

కేశినేనికి దారి తెలీడం లేదా ?

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తనను తాను ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. బెజవాడను తిరుగులేని విధంగా అభివృద్ధి చేశానని.. టాటా ట్రస్ట్ అంటే తనదేనన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇండిపెండెంట్ గా...

‘గుహ’ క‌డుతున్న ప్ర‌భాస్‌

డ్రీమ్ హౌస్‌.. అంటూ ప్ర‌తీ ఒక్క‌రికీ ఉంటుంది. త‌మ ఇల్లు ఎలా ఉండాలో.. ముందు నుంచీ క‌ల‌లు కంటుంటారు. అలాంటి క‌ల ప్ర‌భాస్‌కీ ఉంది. అత్యాధునిక హంగుల‌తో ఓ ఫామ్ హౌస్ నిర్మించుకోవాల‌ని...

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు కేంద్రం కూడా రెడీ !

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఎవరూ ఊహించని విధంగా .. అత్యంత కాస్ట్ లీగా నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది. మరోసారి మన తెలంగాణ .. అనే సెంటిమెంట్ అందరిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close