మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో చెప్పారు.. పత్రికల్లో చెప్పారు. చిట్స్ వేసిన వాళ్లు అందరూ డబ్బులు తీసుకోవాలని లేకపోతే డబ్బులకు గ్యారంటీ లేదని బెదిరింపులకు దిగారు. ఎవరూ తీసుకోలేదు. ఆ కంపెనీ వ్యాపారం అంతకంతకూ పెరుగుతోంది. ఎందుకంటే మార్గదర్శి నమ్మకం అలాంటిది. నమ్మకం ఎలాంటిదో రోజాను అడిగినా చెబుతారు.
రోజాకు మార్గదర్శిలో రూ. నలభై లక్షలకుపైగా విలువైన చిట్ ఉంది. అంత మొత్తంలో ఆమె కట్టారన్నమాట. అంటే వాటిని వెనక్కి తీసుకోలేదు. తాను చిట్ నుంచి ఉపసంహరించుకుంటానని కూడా ఆమె వెళ్లలేదు. తన సొంత ప్రభుత్వం మార్గదర్శిపై దాడి చేస్తూ.. ఆ కంపెనీని కూలగొట్టేస్తామన్నట్లుగా వ్యవహరించినా… రోజా ఏ మాత్రం భయపడేదు. అది మార్గదర్శికి ఉన్న విశ్వసనీయత అనుకోవచ్చు. అదే సమయంలో జగన్ రెడ్డి ఏమీ చేయలేరన్న నమ్మకం కూడా.
ఎన్నికల అఫిడవిట్ లో రోజా తన చిట్ గురించి చెప్పడం… వైరల్ గా మారింది. జగన్ రెడ్డి .. పై సొంత పార్టీ నేతలకూ విశ్వాసం ఉండదని.. అలాగే తన ప్రత్యర్థుల విశ్వసనీయతనూ ఆయన దెబ్బతీయలేరని స్పష్టమైంది. .. రోజాకు మార్గదర్శిలోనే కాదు.. మరో చిట్ ఫండ్ కంపెనీలోనూ చిట్ ఉంది.