ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్న దశలో అప్పటికే సీఎం అయిన రేవంత్ రెడ్డి.. తన సహచర ఎంపీలందరికీ ఢిల్లీలో విందు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదికి చెందిన కాంగ్రెస్ ఎంపీలను పిలిచారు. పార్టీలకు అతీతంగా తనతో స్నేహంగా ఉండేవారందర్నీ పిలిచారు. ఆ విందుకు వెళ్లిన వైసీపీ ఎంపీలెవరికీ జగన్ టిక్కెట్లు ఇవ్వలేదు. పార్టీలో కూడా ఉండనీయలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే అంటే.. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో రోజా షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ నవ్వుతూ మాట్లాడుకున్న వీడియో వైరల్ అవుతోంది.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున.. ఏదో పని మీద రోజా ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్ లోక వెళ్లారు. తన పని అయిపోయిందేమో కానీ బయటకు వస్తున్న సమయంలో .. రేవంత్ రెడ్డి పార్లమెంట్ లోపలికి వెళ్తున్నారు. రోజా వీలైనంత వరకూ పక్క నుంచి పోవాలనుకున్నారు కానీ రేవంత్ వదిలి పెట్టలేదు. పలకరించి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చి మంచీచెడ్డలు కనుక్కున్నారు. వేం నరేందర్ రెడ్డిని కూడా రోజా పలకరించాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్ ఆ వీడియోను చూస్తే.. ఏమనుకుంటారోనని రోజా భయపడవచ్చు. నిజానికి ఆ వీడియో ప్లాన్డ్ గా తీసింది కాదు. ఎవరో మొబైల్ తో తీశారు. ఆ విషయం కూడా తేలిపోయింది.
కెమెరాలు లేవని అనుకోవడానికి లేకుండా పోయింది. ఇప్పుడు వీడియో వైరల్ అయింది. జగన్ ఎలా తీసుకుంటారన్నదానిపై రోజా రాజకీయం ఆధారపడి ఉంటుంది. ఆయన అపనమ్మకం పెంచుకుంటే.. ప్రాధాన్యత లభిచడం కష్టమవుతుంది. ఇప్పటికే పెద్దిరెడ్డి లాంటి వారు రోజాకు వ్యతిరేకంగా చేయాల్సిన రాజకీయం చేస్తున్నారు. సాధారణంగా రోజాను ఎవరైనా కలిస్తే నెగెటివ్ గా ప్రచారం చేస్తూంటారు. కానీ ఇక్కడ రోజాకు రివర్స్ లో ఇబ్బంది కలుగుతోంది.


