ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన రోజా

నాలుగు రోజుల క్రితం పుత్తూరులో బోర్ ఓపెనింగ్ కి వెళ్లిన సందర్భంగా తాను నడుస్తుంటే తన ముందు పూలు చల్లించుకున్న సంఘటన రోజాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆ సంఘటన మీద రోజా పదే పదే వివరణ ఇవ్వాల్సి వస్తోంది. అయితే ఆ వివరణ ఇచ్చే సందర్భంలో ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చానల్స్ లైవ్ లో రోజా నీళ్లు నమిలింది. వివరాల్లోకి వెళితే..

కొద్ది రోజుల క్రితం రోజా చిత్తూరులోని సుందరయ్య కాలనీలో ఒక బోరు ప్రారంభించిన సందర్భంగా అక్కడికి వెళ్ళింది. అక్కడి ప్రజలు ఆ సందర్భంలో ఆవిడ మీద పూలు చల్లడం, భారీ గజమాల తో సత్కరించడం ఇవన్నీ రికార్డ్ అయిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ
సంఘటన జరిగిన కొత్తలో లోకల్ మీడియా ఈ సంఘటనకు ప్రాధాన్యం ఇవ్వకపోయినా సోషల్ మీడియా, నేషనల్ మీడియా లో ఎమ్మెల్యే రోజా మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యే అయి ఉండి లాక్ డౌన్ సందర్భంలో సోషల్ డిస్టెన్స్ పాటించకుండా బోరు ఓపెనింగ్ చేసింది అని, కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేల వలె రోజా కూడా కరోనా వ్యాప్తికి కారణం అవుతోందని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల తీవ్రత మరీ పెరగడంతో వివరణ ఇచ్చిన రోజా, తెలుగు దేశం పార్టీ నేతలు ఉద్దేశ్య పూర్వకంగానే తన మీద బురద జల్లుతున్నారని, ఎప్పటి లాగానే ప్రతిపక్షం మీద నెపాన్ని వేసింది. అయితే టీవీ ఛానల్ లో లైవ్ లోకి వచ్చిన రోజా కి ఎదురైన ప్రశ్నలకు ఆవిడ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలింది. టీవీ చానల్స్ డిబేట్ లో రోజాకు ఎదురైన ప్రశ్నలు ఇవే:

1. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే కార్యక్రమాన్ని నిర్వహించామని చెబుతున్న రోజా, తనను భారీ గజమాల తో సత్కరించే సమయంలో, మరి కొన్ని సమయాల్లో సోషల్ డిస్టెన్స్ పాటించకుండా వీడియో లో కనిపించడం పై ఏమని సమాధానం ఇస్తారు

2. తమకు తాము బోరు కూడా వేయించుకోలేని ప్రజలు, బోర్ వేయించండి ఎమ్మెల్యే సాయం కోరారు. అంతట నిరు పేద ప్రజలు తమకు తామే పూలు తెచ్చుకుని ఎమ్మెల్యే కాళ్ళ మీద చల్లారా? లేదంటే ఈ లాక్ డౌన్ సందర్భంలో అన్ని పూలు వారి దగ్గరికి ఎలా వచ్చాయి.

3. ఇదంతా తెలుగు దేశం పార్టీ నాయకులు చేస్తున్న కుట్ర అని చెబుతున్న రోజా, అక్కడ అ వీడియో తీసే సమయంలో తన చుట్టూ ఉన్నది, ఆ వీడియోని ప్రాచుర్యంలోకి తెచ్చింది తమ అనుచరులే అన్న సంగతి ఎందుకు విస్మరిస్తున్నారు.

4. అధికారులకు , ప్రభుత్వ సిబ్బందికి మాస్కులు శానిటైజర్లు, కిట్లను సరఫరా చేయలేక పోవడంతో నగరి మున్సిపల్ కమిషనర్ ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరి ప్రభుత్వ సిబ్బందికి, విధుల్లో ఉన్న అధికారులకు దొరకని మాస్కులు, కిట్లు, ఎమ్మెల్యేకు , ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆవిడ అనుచరులకు ఎలా వచ్చాయి.

ఇవీ రోజాకు ఆయా‌ చానల్స్ లో డిబేట్ లో సందర్భంగా ఎదురవుతున్న ప్రశ్నలు. అయితే ఈ ప్రశ్నలు వేటికీ సమాధానం చెప్పలేక నీళ్లు నమలడం ఆవిడ కి పరిపాటిగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పాపులర్ అయిన కొత్త లో, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే తాట తీస్తా అంటూ బీరాలు పలికిన రోజా, ప్రస్తుతం డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాల్లో తల మునకలై ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close