రోజా వర్సెస్ అచ్చెన్న రాజీనామాల సవాళ్లు !

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాజకీయ సవాళ్లు విసురుకున్నారు. రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని ఒకరిని ఒకరి ప్రతి సవాల్ చేసుకున్నారు. వీరి సవాళ్లు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. ఇటీవల తమ పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి 160 సీట్లు వస్తాయన్నారు. ఇది రోజాకు నచ్చలేదు. మహిళా దినోత్సవంలో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడిన రోజా.. చంద్రబాబు, లోకేష్ తలకిందులుగా తపస్సు చేసినా 160 సీట్లు రావన్నారు. ఇప్పుడున్నఇరవై మూడు సీట్లు కూడా నిలబెట్టుకోలేరని విమర్శించారు.

అంతటితో ఆగలేదు..అచ్చెన్నాయుడుపై బాడీషేమింగ్ విమర్శలు చేశారు. గట్టి చట్నీ గట్టిగా తింటే అచ్చెన్నాయుడు 160 కిలోలు పెరుగుతారేమోగానీ. ఇప్పుడున్న 23 సీట్లు రావడం కూడా కష్టమని నీకు సరదాగా ఉంటే టెక్కలిలో రాజీనామా చేసి ఎన్నికలకు రా.. అంటూ సవాల్‌ చేశారు. రోజా విమర్శలపై అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. నగరిలో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. అక్కడ టీడీపీ ఓడిపోతే.. సాధారణ ఎన్నికల్లో అక్కడ పోటీపెట్టబోమన్నారు.

చంద్రబాబు, అచ్చెన్నాయుడు తల కిందుల తపస్సు చేసినా 160 సీట్లు రావంటున్నారని .. రోజాకు ధైర్యముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఎన్నికలకు సిద్ధపడాలని సవాల్‌ విసిరారు.. నగరిలో టీడీపీ ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాల్లో మేం పోటీ చేయబోమని ప్రకటించారు అచ్చెన్నాయుడు.. సింపతీ కోసం కోడి కత్తి డ్రామా ఆడారు.. అయినా దాని వల్ల సింపతీ రాలేదని.. మరింత సింపతీ కోసం తన బాబాయిని చంపేసినా పట్టించుకోని వ్యక్తి జగన్ అని ఆరోపించారు. 151 సీట్లు వచ్చినా.. అతి తక్కువ కాలంలో సీఎం వైఎస్‌ జగన్‌ విపరీతమైన వ్యతిరేకతను పెంచుకున్నారని విమర్శించారు. అచ్చెన్న సవాల్‌పైరోజా ఎలా స్పందిస్తుందో మరి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

గుంటూరు కారం: త్రీడీలో క‌నిపించిన బీడీ

https://www.youtube.com/watch?v=V-n_w4t9eEU&feature=youtu.be ముందు నుంచీ అనుకొంటున్న‌ట్టే.. మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ సినిమాకి 'గుంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా ఈ రోజు ఫ‌స్ట్ గ్లిమ్స్ విడుద‌ల...

కేశినేనికి దారి తెలీడం లేదా ?

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తనను తాను ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. బెజవాడను తిరుగులేని విధంగా అభివృద్ధి చేశానని.. టాటా ట్రస్ట్ అంటే తనదేనన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇండిపెండెంట్ గా...

‘గుహ’ క‌డుతున్న ప్ర‌భాస్‌

డ్రీమ్ హౌస్‌.. అంటూ ప్ర‌తీ ఒక్క‌రికీ ఉంటుంది. త‌మ ఇల్లు ఎలా ఉండాలో.. ముందు నుంచీ క‌ల‌లు కంటుంటారు. అలాంటి క‌ల ప్ర‌భాస్‌కీ ఉంది. అత్యాధునిక హంగుల‌తో ఓ ఫామ్ హౌస్ నిర్మించుకోవాల‌ని...

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు కేంద్రం కూడా రెడీ !

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఎవరూ ఊహించని విధంగా .. అత్యంత కాస్ట్ లీగా నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది. మరోసారి మన తెలంగాణ .. అనే సెంటిమెంట్ అందరిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close