తిరుపతి జిల్లా తరపున మంత్రిగా ఉన్న రోజాకు ప్రోటోకాల్ లభిస్తుంది. మంత్రిగా జిల్లాపై పెత్తనం ఉంటుంది. . పుంగనూరు మంత్రి పెద్దిరెడ్డికి చిత్తూరు జిల్లాపై పెత్తనం ఉంది. అయితే తిరుపతి జిల్లా కూడా తన కనుసన్నల్లో ఉండాలనుకుంటున్న పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలోని రెండు మండలాలలను తిరుపతిలో కలిపించి…. తాను కూడా తిరుపతి జిల్లా మంత్రిని కావాలనుకుంటున్నారు. ఆ ప్రక్రియ ప్రారంభించేశారు.
వచ్చే ఎన్నికల్లో తిరుపతి జిల్లాలోనూ తన అనుచరుల్ని పెద్దిరెడ్డి నిలబెట్టబోతున్నారు. ముఖ్యంగా రోజాను ఆయన టార్గెట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రోజా నోటికి భయపడి అయినా ఆమెకు జగన్ రెడ్డి టిక్కెట్ ఇస్తారని.. కానీ రెబల్ ను నిలబెట్టి గెలిపించాలన్న పట్టదలతో పెద్దిరెడ్డి ఉన్నారని అంటున్నారు. అందుకే తిరుపతి నుంచి కూడా తన మాటను అధికారులు వినాలంటే… ఆ జిల్లాలో తనకు ప్రోటోకాల్ రావాలని అనుకుంటున్నారు..
జిల్లాల ఏర్పాటుకు ఎలా ప్రాతిపదిక లేదో… పుంగనూరు మండలాలను తిరుపతి జిల్లాలో మార్చడానికి కూడా అలా ప్రతిపాదిక లేదు. ఎప్పుడో వందేళ్ల కిందట ఆ రెండు మండలాలు తిరుపతి జిల్లాలో ఉండేవని చెప్పారు. ఆ మాటకొస్తే… ఇక జిల్లాల విభజన ఎందుకు ? వందేళ్ల కింద ఎలా ఉండేవో అలా చేస్తే పోలా అని ఎవరికైనా డౌట్ వస్తే… వైసీపీ దృష్టిలో పిచ్చోళ్లనుకోవచ్చు. కారణం ఏదైనా పెద్దిరెడ్డి రోజా టార్గెట్ గా పెద్ద ప్లానే వేశారు.