అసలు ఆ రోజు రోజా ఏమంది: లీకైన అసెంబ్లీ గొడవ వీడియో

హైదరాబాద్: ఈ నెల 18న అసెంబ్లీలో కాల్‌మనీ వ్యవహారంపై చర్చకు డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొడవకు దిగటం, ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి సీటువద్దకు వెళ్ళి మరీ అనుచిత వ్యాఖ్యలతో దుర్భాషలాడటం, దాని ఫలితంగా ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేయటం తెలిసిందే. అయితే ఆ రోజు రోజా ముఖ్యమంత్రినే కాదు, పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను కూడా దుర్భాషలాడినట్లు ఇవాళ బయటపడింది. రోజా తనగురించి చేసిన అనుచిత వ్యాఖ్యలను చెప్పుకుని అనిత ఇవాళ అసెంబ్లీలో విలపించటంతో ఈ సంగతి వెలుగులోకొచ్చింది. రోజుకొకళ్ళతో పడుకుంటావని, మొగుడిని వదిలేశావని అంటూ రోజా తనను దుర్భాషలాడారని అనిత చెప్పారు. రోజాపై సస్పెన్షన్ మాత్రమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలపై హైకోర్టుకు వెళతానని, ఎస్టీ-ఎస్టీ కమిషన్‌కు, మహిళా కమిషన్‌కు వెళతానని చెప్పారు.

మరోవైపు రోజా ఆ రోజు చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో తాజాగా బయటకొచ్చింది. దానిలో రోజా అనితను దుర్భాషలాడటం స్పష్టంగా వినిపిస్తోంది. అసలు ఆ రోజు జరిగిందేమిటంటే, ముఖ్యమంత్రిపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత అనిత లేచి ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరింది. దీనిపైనే రోజా ఆగ్రహోదగ్రురాలై అనితపై ఈ వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రి ఉండగా మహిళల గురించి మాట్లాడుతున్నారని, తాను మొగుడిని కొట్టి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళలేదని, ఎవరు పడితే వాళ్ళతో పడుకోలేదని, తన గురించి మాట్లాడటానికి ఆమె ఎవరు అధ్యక్షా అని రోజా అన్నారు. చంద్రబాబునాయుడు ఒక ముఖ్యమంత్రి పిలిచి అబద్ధాలు చెబుతున్నాడంటే ఆయన స్థాయి ఎంత దిగజారిందో అర్థమవుతుందని రోజా వ్యాఖ్యానించారు. రోజా వ్యాఖ్యల వీడియోను కింద చూడండి.

[youtube https://www.youtube.com/watch?v=jit5Ly-P4Jo&w=640&h=480]

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com