పూరి గ‌ట్స్‌.. రెండ్రోజుల ముందే ప్రీమియ‌ర్‌

సినిమాకి టాక్ చాలా ముఖ్యం. పాజిటీవ్ టాక్ వ‌స్తే – క‌ల‌క్ష‌న్లు వ‌స్తాయి. ఏమాత్రం తేడా వ‌చ్చినా – ఫ‌ట్‌మ‌న‌డం ఖాయం. రిలీజ్ డే టాక్ అనేది వ‌సూళ్ల‌లో కీల‌క పాత్ర పోషిస్తుంటుంది. సినిమాపై న‌మ్మ‌కం ఉన్న‌వాళ్లు మాత్రం ప్రీమియ‌ర్స్ షోల‌తో కాస్త హ‌డావుడి చేస్తుంటారు. ఒక రోజు ముందు మీడియాకీ, సెల‌బ్రెటీల‌కూ ప్రీమియ‌ర్ షో వేయ‌డం మామూలే. అయితే పూరి మాత్రం రెండ్రోజుల ముందే – ప్రీమియ‌ర్స్ కి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

పూరి జ‌గ‌న్నాథ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన చిత్రం `రొమాంటిక్‌`. ఈ చిత్రానికి పూరి క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే కూడా అందించాడు. ఈనెల 29న విడుద‌ల అవుతోంది. అయితే రెండ్రోజుల ముందే అంటే ఈనెల 27న రొమాంటిక్ స్పెష‌ల్ ప్రీమియ‌ర్స్‌ప‌డ‌బోతున్నాయి. హైద‌రాబాద్ లోని ఏఎంబీ మాల్ లో బుధ‌వారం రాత్రి 8 గంట‌ల‌కు రొమాంటిక్ స్పెష‌ల్ స్క్రీనింగ్ జ‌ర‌గ‌బోతోంది. టాలీవుడ్ లోని సెల‌బ్రెటీలంతా ఈ షోకి హాజ‌రు కాబోతున్నారు. మీడియాకు మ‌రో షో ఉంది. రెండు రోజుల ముందే ప్రీమియ‌ర్స్ అంటే గట్స్ ఉండాలి. ఎందుకంటే ఈలోగా టాక్ ప్ర‌పంచమంతా పాకేస్తుంది. ఈ టాక్ ని బ‌ట్టే సినిమా చూడాలా, వ‌ద్దా? అనేది కొంత‌మంది డిసైడ్ చేసుకుంటారు. 29న రొమాంటిక్ తోపాటుగా వ‌రుడు కావ‌లెను కూడా వ‌స్తోంది. ఈ రెండింటి మ‌ధ్య మంచి పోటీ ఉంది. కాబ‌ట్టి.. ప్రీమియ‌ర్స్ వేయ‌డం సాహ‌సోపేత‌మైన నిర్ణ‌య‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీటు గ్యారంటీ అనుకున్న సీనియర్లకూ చంద్రబాబు ఝులక్ !

తెలుగుదేశం పార్టీలో ఏం చేసినా చేయకపోయినా సీటు గ్యారంటీ అని కొంత మంది సీనియర్లు అనుకుంటూ ఉంటారు. పార్టీతో తమది దశాబ్దాల అనుబంధమని.. తమను పక్కన పెట్టలేరని వారు అనుకుంటూ ఉంటారు. అలాంటి...

ఎమ్మెల్సీ అనంతబాబు మామూలోడు కాదు !

డ్రైవర్‌ను హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబుపై చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన అమాయకులైన గిరిజులను భయపెట్టి.. గుప్పిట్లో ఉంచుకోవడం ద్వారా రాజకీయ ప్రాబల్యం పెంచుకున్నారు....

దావోస్ ఫస్ట్ డే : అదానీతో భేటీ – డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం!

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి సారి దావోస్ మీటింగ్‌కు వెళ్లిన సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి రోజు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సలహా పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. ...

బొమ్మరిల్లు భాస్కర్ తో నాగచైతన్య ?

నాగచైనత్య లిస్టు లో మరో సినిమా చేరింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా ఖరారైయింది. 'థ్యాంక్ యూ' సినిమా దాదాపు పూర్తి చేశాడు చైతు. వెంకట్ ప్రభుతో సినిమా సెట్స్ పైకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close