శ్రీకాంత్ తనయుడు రోషన్ చేస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకుడు. జీ స్టూడియోస్ , స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్.. ఇలా నిర్మాణం వెనుక పెద్ద బలగమే వుంది. తాజాగా టీజర్ వదిలారు. స్వాతంత్ర్యానికి ముందు హైదరాబాదీ ఫుట్‌బాలర్ మైఖేల్ సీ. విలియమ్స్ అనే ఆటగాడి కథ ఇది. తనకి దేశం కోసం ఆడి, ఇంగ్లండ్‌లో రాణి ఎలిజబెత్‌ను కలుసుకునే అవకాశం వస్తుంది. కానీ అతని జీవితంలో చాలా సవాళ్ళు వుంటాయి. అవేంటనేది ఆసక్తికరం.
ఫుట్‌బాలర్‌గా రోషన్ కొత్త లుక్‌లో కనిపించాడు. హైదరాబాదీ యాస హిందీ మిక్స్ డైలాగ్ డెలివరీ బావుంది. అనస్వర రాజన్ తో ప్రేమకథ కూడా బలంగానే వుంది. దర్శకుడు ప్రదీప్ అద్వైతం స్పోర్ట్స్, యాక్షన్, రొమాన్స్, వార్.. ఇలా చాలా ఎలిమెంట్స్ జోడించాడు. ప్రీ-ఇండిపెండెన్స్ విజువైలైజేషన్ నేచురల్ గా వుంది. మిక్కీ ఆర్ఆర్ కూడా బాగా కుదిరింది. మొత్తనికి టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. డిసెంబర్ 25న సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది.
