రోష‌న్‌.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో!

పెళ్లి సంద‌డి 2తో.. త‌న ఖాతాలో ఓ హిట్ వేసుకొన్నాడు శ్రీ‌కాంత్ త‌నయుడు రోష‌న్‌. చూడ్డానికి బాగున్నాడు. న‌ట‌న‌లో ఈజ్ కూడా ఉంది. అందుకే త‌న‌కు మంచి అవ‌కాశాలు వ‌చ్చాయి. పెళ్లి సంద‌డి త‌ర‌వాత ఎన్ని అవ‌కాశాలు వ‌చ్చినా, ఆచి తూచి అడుగులేశాడు. ఎట్ట‌కేల‌కు ఓ ప్రాజెక్ట్ ఓకే చేశాడు. క‌న్న‌డ ద‌ర్శ‌కుడు నంద కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి ఒప్పుకొన్నాడు. ఈ సినిమాలో మోహ‌న్ లాల్ కూడా న‌టిస్తున్నారు. ఇదో పిరియాడిక‌ల్ ఎమోష‌న‌ల్ డ్రామా. మోహ‌న్ లాల్ – రోష‌న్ తండ్రీ కొడుకులుగా క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల‌లోనే హైద‌రాబాద్ లో షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంది. రోష‌న్ న‌టించే తదుప‌రి సినిమా కూడా ఓకే అయిపోయింది. వైజ‌యంతీ మూవీస్‌లో రోష‌న్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ చిత్రంతో ప్ర‌దీప్ అద్వైతం ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇదో ప్రేమ క‌థ అని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రాబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో మంత్రులు ఫెయిల్..!?

కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నా ఒకరిద్దరూ మంత్రులు మినహా మిగతా వారెవరూ పెద్దగా స్పందించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. వీటన్నింటికి రేవంత్ ఒక్కడే కౌంటర్ ఇస్తున్నారు తప్పితే మంత్రివర్గం...

ఇలా అయితే కుదరదు మార్చాల్సిందే…త్వరలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం

తెలంగాణ సీఎంవోను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారా..? ఫైల్స్ క్లియరెన్స్ లో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదులు అందటంతో సమర్ధవంతమైన అధికారులను నియమించాలని ఫిక్స్ అయ్యారా..? ఎన్నికల కోడ్ ముగియగానే సీఎంవోలో...

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close