ఎల‌క్ష‌న్ల‌పై.. ఆర్పీ ప‌ట్నాయ‌క్ వ్యంగాస్త్రం

ఆర్పీ పట్నాయ‌క్ సంగీత ద‌ర్శకుడే కాదు. గాయ‌కుడు, న‌టుడు, ద‌ర్శ‌కుడు కూడా. కొంత‌కాలం సంగీతం ప‌క్క‌న పెట్టి, మెగాఫోన్ ప‌ట్టాడు. అయితే అక్క‌డ అనుకొన్నంత స‌క్సెస్ ల‌భించ‌లేదు. దాంతో… మళ్లీ సొంత గూటికి చేరి, స్వ‌రాలు స‌మ‌కూర్చే ప‌నిలో బిజీ అయ్యాడు. త‌ను సంగీతం అందించిన ‘అహింస‌’ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. అయితే.. మెగాఫోన్ పూర్తిగా వ‌ద‌ల్లేద‌ని, కొత్త క‌థ‌లు రాసుకొంటున్నాన‌ని చెప్పుకొచ్చాడు ఆర్పీ. త‌న ద‌గ్గ‌ర ఓ పెద్ద క‌థ ఉంద‌ట‌. అది ఎన్నిక‌ల నేప‌థ్యంలో సాగుతుంద‌ని, అది గ‌నుక బ‌య‌ట‌కు వ‌స్తే… ఎల‌క్ష‌న్ల తీరు పూర్తిగా మారిపోతుంద‌ని, అంత ప్ర‌భావం చూపిస్తుంద‌ని, స‌రైన నిర్మాత కోసం ఎదురు చూస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు ఆర్పీ.

”రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నా ద‌గ్గ‌ర చాలా క‌థ‌లు ఉన్నాయి. కానీ నాతో సినిమా తీసే ధైర్యం నిర్మాత‌ల‌కు లేదు. ఎందుకంటే.. నా సినిమాలు కొన్ని స‌రిగా ఆడ‌లేదు. స‌రైన నిర్మాత‌లు ఉంటే యేడాదికి ద‌ర్శ‌కుడిగా నాలుగు సినిమాలు తీస్తా. అన్ని క‌థ‌లు నా ద‌గ్గ‌ర ఉన్నాయి. ఎల‌క్ష‌న్ల తీరుపై ఓ క‌థ రాశాను. అది బ‌య‌ట‌కు వ‌స్తే సంచ‌న‌లం అవుతుంది. కానీ.. నిర్మాత‌లు న‌న్ను న‌మ్మాలి. ధైర్యం చేయాలి” అంటున్నాడు ఆర్పీ. మ‌రి.. ఆర్పీని న‌మ్మి ధైర్యం చేసే నిర్మాత ఎవ‌రైనా ఉన్నారా? అంత రిస్క్ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చేయ‌గ‌ల‌రా? ఇది మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్న‌. ఆర్పీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాల్లో `బ్రోక‌ర్` బాగానే ఉంటుంది. కానీ ఆ సినిమా సైతం ఆర్దికంగా విజ‌యం సాధించ‌లేక‌పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close