ఆర్ ఆర్ ఆర్, ఆచార్య విడుదల తేదీల పై క్లారిటీ, భీమ్లా మళ్లీ డేట్ మారుస్తాడా?

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీ ఖాయమైపోయింది. మార్చి 25వ తేదీన తమ సినిమాను విడుదల చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. దీంతో కొన్ని సినిమాలకు స్పష్టత మరికొన్నింటికి అస్పష్టత ఏర్పడింది. వివరాల్లోకి వెళితే..

కరోనా కారణంగా నాలుగు సార్లు వాయిదా పడ్డ ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని ఖాయం చేసుకుంది. జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన సినిమా ఒమిక్రాన్ కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే, వాయిదా పడే సమయంలో మార్చి 18 కానీ ఏప్రిల్ 28 కానీ విడుదల చేస్తామని ప్రకటించిన ఆర్ఆర్ యూనిట్, ‌ తాజాగా మార్చి 25వ తేదీని విడుదల తేదీ గా ప్రకటించింది. కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ నటించిన ఆఖరి చిత్రం విడుదల సందర్భంగా మార్చి 18 నుండి 23వ తేదీ వరకు వేరే ఇతర చిత్రాలను ప్రదర్శించకూడదు అని ఎగ్జిబిటర్లు స్వచ్ఛందంగా నిర్ణయించుకోవడంతో వారి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆర్ ఆర్ ఆర్ సినిమా యూనిట్ కూడా తమ తేదీని మార్చి 25వ తేదీకి జరుపుకుంది ‌ దీంతో ఆచార్య సినిమా ఏప్రిల్ 29న రావడం కూడా ఖాయమైపోయింది. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఏప్రిల్ 28 వ తేదీని ఖాయం చేసుకున్నట్లయితే ఆచార్య సినిమా విడుదల తేదీ కూడా మారి ఉండేది.

అయితే ఏప్రిల్ 1న విడుదల కావాల్సిన భీమ్లా నాయక్ పరిస్థితి విషయంలో కొంత అస్పష్టత నెలకొంది. జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా ని ఆర్ఆర్ సినిమా కోసమే అప్పట్లో వెనక్కి జరిపారు. ఇప్పుడు మార్చి 25 ఏప్రిల్ 1 తేదీల మధ్య కూడా వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో, భీమ్లా నాయక్ ని ఈసారి కూడా ముందుకు గాని వెనక్కి గాని జరిపే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి భీమ్లా నాయక్ విడుదల తేదీపై మరి కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌పై గవర్నర్‌దే పైచేయి !

గవర్నర్‌పై ఆవేశంగా హైకోర్టుకెళ్లిన తెలంగాణ సర్కార్ చివరికి ఆవేశం కాదు.. ఆలోచన ఉండాలని తెలుసుకుది. ఇంత కాలం గవర్నర్ విషయంలో చేస్తున్నదంతా తప్పు అని ఒప్పుకోవాల్సి వచ్చినట్లయింది. హైకోర్టులో వేసిన అత్యవసర పిటిషన్...

వైసీపీ ఎమ్మెల్యే “అవినీతిలో నిజాయితీ” చూస్తే మైండ్ బ్లాంకే !

మేమేమి నీతి మంతులం కాదు.. అవినీతి చేయడం లేదని చెప్పడంలేదు.. కానీ తక్కువే చేస్తున్నాం... అని ఘనంగా ప్రకటించుకున్నారు.. ఓ వైసీపీ ఎమ్మెల్యే. తక్కువే అంటే ఎంత అనే డౌట్ ఇతరులకు...

ఆ ముసలాయన బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేదు: జగన్

యాభై ఏళ్లు దాటిన జగన్మనోహన్ రెడ్డి చంద్రబాబును ముసలాయన అని సంబోధించడం ప్రారంభించారు. చేదోడు పథకం కింద గట్టిగా నియోజకవర్గానికి రెండు వేల మందికి కూడా లబ్ది చేకూర్చని పథకానికి .. రూ.కోట్లు...

జ‌మున బ‌యోపిక్‌లో త‌మ‌న్నా?

ఓ అగ్ర తార చ‌నిపోయిన మ‌రుక్ష‌ణం.. బ‌యోపిక్ తీస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచ‌న వ‌స్తుందేమో..? ఈమ‌ధ్య అలానే జ‌రిగింది. ఇప్పుడు జమున విష‌యంలోనూ ఇలానే ఆలోచిస్తోంది చిత్ర‌సీమ‌. దాదాపు 200...

HOT NEWS

css.php
[X] Close
[X] Close