టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు ఎప్పుడు సబ్‌మిట్ చేస్తారో తెలియదు కానీ.. ఏపీ నెంబర్ వన్ చానల్ టీవీ9 మాత్రం.. ప్రాథమిక నివేదిక ప్రకటించేసింది. రఘురమకృష్ణరాజు కాళ్లకు దెబ్బలు సొరియాసిస్ అనే వ్యాధి వల్ల వచ్చాయట. ఈ విషయాన్ని బ్రేకింగ్‌లు వేసి మరీ.. చెప్పింది. రఘురామకృష్ణరాజు సొరియాసిస్‌తో బాధపడుతున్నారని… అందుకే చర్మవ్యాధుల నిపుణులు కూడా వచ్చి … రఘురామకృష్ణరాజు కాళ్లను పరిశీలిస్తున్నారని టీవీ9 బ్రేకింగ్‌ల సారాంశం.

టీవీ9 అంటే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అధికార పార్టీల రాజకీయ వ్యూహాల్లో భాగంగా.. వారికి కావాల్సిన విధంగా ఇతరులపై బురద చల్లడానికి.. ఎలాంటి రూల్స్ పెట్టుకోకుండా వార్తలు ప్రసారం చేయడంలో టీవీ9 ముందుంది. ఇప్పుడు.. రఘురామకృష్ణరాజుకు సొరియాసిస్ అని ముందుగానే చెప్పడం వల్ల.. సాయంత్రానికి రిపోర్ట్ కూడా అలాగే వస్తుందని హింటిచ్చిందన్నమాట.

కోర్టు.. మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి టెస్టులు చేయమని ఆదేశించింది. అటు గవర్నమెంట్ ఆస్పత్రితో పాటు ఇటు రమేష్ హాస్పిటల్‌లోనూ టెస్టులు చేయించమన్నది. అసలు టెస్టులు జరుగుతున్నాయో లేదో కానీ.. మొత్తానికి టీవీ9 మాత్రం ప్రాథమిక నివేదిక బయట పెట్టేసి అందర్నీ ఆశ్చర్య పరిచేసింది. ఎంతైనా నెంబర్ వన్ చానల్ కదా..!?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో  'అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన  హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. సెన్సేష‌న‌ల్ కాన్స‌ర్ట్స్ ఏర్పాటుచేయ‌డంలో అగ్రగామిగా ఉన్న హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఈ సంవత్సరం టాలీవుడ్ మ్యూజిక్...

శ్రీ‌నువైట్ల మ‌ల్టీస్టార‌ర్… ‘డ‌బుల్స్‌’

వ‌రుస హిట్లు ఇచ్చిన శ్రీ‌నువైట్ల‌.. ఇప్పుడు వ‌రుస ఫ్లాపుల‌ను మోస్తున్నాడు. అయినా స‌రే, మళ్లీ త‌న‌దైన ముద్ర వేయ‌డానికి త‌ప‌న ప‌డుతున్నాడు. అందులో భాగంగా `ఢీ అండ్ ఢీ` తీస్తున్నాడు. `డ‌బుల్ డోస్‌`...

జనసేనను మరోసారి కించ పర్చిన ఏపీ బీజేపీ..!

పవన్ కల్యాణ్‌కు కేంద్రంలో మంత్రి పదవి అని ఢిల్లీ నుంచి బీజేపీ లీకులు ఇస్తూ గిలిగింతలు పెడుతోంది కానీ.. అసలు విషయం మాత్రం అసలు జనసేనను లెక్కలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఏపీ...

ఏపీ సర్కార్‌ను అప్పులు చేయనివ్వొద్దని మోడీకి రఘురామ లేఖ..!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అప్పుల మీద నడుస్తోంది. నెలకు రూ. ఆరేడు వేల కోట్లు అప్పులు ఎలాగోలా తెచ్చుకోకపోతే.. ఆ నెల దివాలా ప్రకటించాల్సిన పరిస్థితి. ఆ అప్పులు కూడా రాకుండా చేయాలని...

HOT NEWS

[X] Close
[X] Close