‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. వీర నాటు’ డ్యాన్స్

రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినీ ప్రేక్షకులని ఊరిస్తుంది. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి మెటీరియల్ ట్రెండింగ్ లో వుంటుంది. ఇప్పుడీ సినిమా నుంచి సెకెండ్ సింగెల్ ప్రోమో బయటికి వచ్చింది. ఫుల్‌ మాస్‌ డ్యాన్స్‌తో సాగే ఈ పాట లిరికల్‌ ప్రోమోని మాస్ కి నచ్చేశాల వుంది. ‘నా పాట సూడు.. నా పాట సూడు.. వీర నాటు నాటు’ అంటూ సాగే ఈ సాంగ్‌లో రామ్‌చరణ్‌-తారక్‌ పవర్‌ఫుల్‌ స్టెప్పులతో అదరగొట్టేసినట్లు ప్రోమోలో హింట్ ఇచ్చారు.

రాహుల్‌ సిప్లింగంజ్‌, కాల భైరవ ఈ పాటని వేరే లెవల్ ఆలపించారు. రేపు పూర్తి పాట బయటికి వస్తుంది. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా కనిపించడంతో ఈ సినిమా పాయింట్ పై కూడా చాలా ఉత్కంఠ నెలకొంది. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.