పోస్ట‌ర్‌తోనే పోలిక‌లు మొద‌లా?

రాజ‌మౌళి సినిమాలు ఎంత గొప్ప విజ‌యాన్ని సాధిస్తాయో, రాజ‌మౌళికి, అత‌ని టీమ్ కీ ఎంత పేరు తీసుకొస్తాయో.. మిగిలిన వాళ్ల‌కు అంత ప‌రీక్ష‌గా మిగిలిపోతాయి. భారీ సినిమా ఏదొచ్చినా రాజ‌మౌళి సినిమాల‌తో పోలిక‌లు మొద‌లైపోతాయి. ఇది రాజ‌మౌళి పోస్ట‌ర్ లా లేదు, ఈ ఎఫెక్ట్స్ రాజ‌మౌళి అయితే ఇలా తీసుండేవాడు కాదు… అంటూ పోలుస్తుంటారు. ఇప్పుడు `ఆదిపురుష్‌`కీ ఈ ఇబ్బంది త‌ప్ప‌లేదు. ప్ర‌భాస్ రాముడిలా క‌నిపించ‌బోతున్న సినిమా `ఆదిపురుష్‌`. ఈ సినిమా అప్‌డేట్ల గురించి అభిమానులు ఎప్ప‌టి నుంచో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు `ఆదిపురుష్‌` నుంచి ఫ‌స్ట్ లుక్ వ‌చ్చింది. బాణాన్ని గాల్లోకి గురి పెట్టిన ప్ర‌భాస్ – త‌న లుక్ తో మెస్మరైజ్ చేశాడు. అయితే ఈ లుక్‌పైనా పెద‌వి విరుస్తున్నారు కొంత‌మంది. `ఆర్‌.ఆర్‌.ఆర్‌`లో అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ ధ‌న‌స్సు ఎక్కి పెట్టిన షాట్ ఒక‌టుంది. ఈ రెండింటినీ ప‌క్క ప‌క్క‌న పెట్టి పోలిక‌లు తీస్తున్నారు. చర‌ణ్ లుక్ తో పోలిస్తే… ప్ర‌భాస్ లుక్ తేలిపోయింద‌న్న‌ది అస‌లు కంప్లైంటు.

ఆర్‌.ఆర్‌.ఆర్ వేరు.. ఆది పురుష్ వేరు. అల్లూరి సీతారామ‌రాజు వేరు.. రాముడు వేరు. ఈ ఇద్ద‌రినీ పోల్చి చూడ‌డంలో ఎలాంటి పాయింటూ లేదు. పోస్ట‌ర్ తోనే పోలిక‌లు మొద‌లెడితే – ఇక టీజ‌ర్‌, ట్రైల‌ర్ లో ఇంకెన్ని తీస్తారో? సినిమాలో ఇంకెన్ని వెదుకుతారో..? రాజ‌మౌళి విజువ‌ల్స్ తోనో, త‌న క్రియేటివిటీతోనో మిగిలిన సినిమాల్ని పోల్చి చూడ‌డం ఆయా సినిమాల ఫ‌లితాల‌పై తీవ్ర‌మైన ప్ర‌భావాన్ని చూపిస్తుంటాయి. `ఆదిపురుష్‌` బెంగ కూడా అదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : గుజరాత్‌లో మళ్లీ బీజేపీ – హిమాచల్‌లో టఫ్ ఫైట్ !

రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మొగ్గు కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ నెలకిందటే ముగిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది. గుజరాత్...

రోజాకు ఇంత అవమానమా !

మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. నోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఆ నోరుకు భయపడే మంత్రి పదవి ఇచ్చారనే టాక్ కూడా ఉంది అది వేరే విషయం. కానీ మంత్రి...

3 రాజధానులు కాదు 3 రాష్ట్రాలు చేయాలన్న పయ్యావుల !

రాయలసీమ గర్జన పేరుతో వైసీపీ నిర్వహించిన సభ ద్వారా ప్రజల మూడ్ ఏమిటో వైసీపీ పెద్దలకు అర్థమయ్యే ఉంటుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెటైర్ వేశారు. సీమ గర్జన పేరుతో...

విజయ్ ఫ్యామిలీతో జాన్వీ కపూర్ బాండింగ్

విజయ్‌ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. లైగర్ సినిమాకి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. జాన్వీ కపూర్ కి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close