RRR ట్రైల‌ర్‌: ప్ర‌తి షాటూ… ఓ ప్ర‌భంజ‌నం

ప్ర‌తీ సీనూ.. ఓ క్లైమాక్స్ లా ఉంది .. అంటుంటారు క‌దా?
ప్ర‌తీ షాటూ.. ఓ క్లైమాక్స్ లా ఉంటే..
అది ఆర్‌.ఆర్‌.ఆర్ ట్రైల‌ర్‌.

రాజ‌మౌళి అంటే ఏమిటో… పాన్ ఇండియా సినిమా అంటే ఏ స్థాయిలో ఉండాలో… ఆర్.ఆర్‌.ఆర్‌.. ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. దేశం మొత్తం ఆస‌క్తితో ఎదురు చూస్తున్న సినిమా ఇది. జ‌న‌వ‌రి 7న విడుద‌ల అవుతుంది. ఈరోజు ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌దిలారు. డైలాగులు, షాట్లూ, ఎమోష‌న్స్‌, విజువ‌లైజేష‌న్‌, ఫైట్స్‌… ఇలా ఒక్క‌టేమిటి..? అన్నీ ఈ 3 నిమిషాల 15 సెక‌న్ల ట్రైల‌ర్‌లో క‌నిపించేశాయి. ఓ ర‌కంగా.. చాలా లెంగ్తీ ట్రైల‌ర్ ఇది. కానీ.. అప్పుడే అయిపోయిందా, ఇంకొంచెం ఉంటే బాగుండేది అనిపించింది.

ఈ ట్రైల‌ర్‌లో స్థూలంగా క‌థ అర్థ‌మైపోయింది. భీమ్.. బ్రీటీష్ వాళ్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతూ ఉంటాడు. రామ్‌.. బ్రిటీషు అధికారి. భీమ్ ని ప‌ట్టుకోవ‌డానికి రామ్ రంగంలోకి దిగుతాడు. కాక‌పోతే… పూర్వాశ్ర‌మంలో ఇద్ద‌రూ స్నేహితులు. ఆ స్నేహం ప‌క్క‌న పెట్టి, వైరం మొద‌ల‌వుతుంది. మ‌ళ్లీ ఇద్ద‌రూ స్నేహితులుగా మార‌తారు. బ్రిటీష్ వారికి వ్య‌తిరేకంగా పోరాడతారు. అదీ క‌థ‌.

స్కాట్ దొర వారు.. మా అదిలాబాద్ వ‌చ్చిన‌ప్పుడు ఓ చిన్న పిల్ల‌ను తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చింది.. ఓ చిన్న పిల్ల‌నండీ

అయితే.. వాళ్లకేమైనా రెండు కొమ్ములుంటాయా?

ఒక కాప‌రి ఉంటాడు

ఇదీ.. భీమ్ ఇంట్ర‌డ‌క్ష‌న్‌. పులితో వేటాడుతున్న కొమ‌రం భీమ్ ని.. పులి కంటే రౌద్రంగా చూపించి….ఎన్టీఆర్ కి ఆకాశ‌మంత ఎలివేష‌న్ ఇచ్చాడు రాజ‌మౌళి.

పులిని ప‌ట్టుకోవ‌డానికి వేట‌గాడు కావాలి. ఆ ప‌ని చేయ‌గ‌లిగేది ఒక్క‌డే సార్‌…

అన్న‌ప్పుడు చ‌ర‌ణ్ ఎంట్రీ ఇచ్చాడు.

ఆ త‌ర‌వాత రామ్- భీమ్ ల స్నేహం చూపించారు.

“న‌న్నీడ ఇడిచిపోక‌న్నా.. అమ్మ యాదికి వ‌స్తుంద‌న్నా“ అన్న‌ప్పుడు ఆషాట్లూ, ఎమోష‌న్లూ అదిరిపోయాయి

“తొంగి తొంగి న‌క్కి న‌క్కి కాదే.. తొక్కుకుంటూ పోవాలె. ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలె..“ అంటూ బీమ్ చేసే పోరాటం… `ప్రాణాలు ఆనందంగా ఇచ్చేస్తా బాబాయ్‌` అంటూ…ప్రాణ త్యాగానికి కూడా సిద్ధ‌ప‌డిన రామ్ ఆరాటం… ఇవ‌న్నీ స్క్రీన్ పై క‌నిపించాయి.

అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్ ఎంట్రీ అదిరిపోయింది.
ఇక బుల్లెట్‌ని గాల్లో గింగురాలు తిప్పుతూ.. భీమ్ అద‌ర‌గొట్టాడు.

“ఈ న‌క్క‌ల వేట ఎంత సేపు.. కుంభ స్థ‌లాన్ని బ‌ద్ద‌లు కొడ‌దాం ప‌ద‌“ అంటూ రామ్ భీమ్ ఇద్ద‌రూ క‌లిసి. విజృంభించారు. ఆఖ‌రి షాట్ అయితే అల్టిమేట్.

ఫుల్ యాక్ష‌న్‌.. మాస్‌.. ఎమోష‌న్‌… ఇవ‌న్నీ ఒకే సినిమాలో కూరి కూరి అందించాడు రాజ‌మౌళి. ఇక ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ అభిమానుల‌కు ఇది పండ‌గే. విజువ‌ల్స్‌, ఆర్‌.ఆర్‌, ఫొటోగ్ర‌ఫీ, యాక్ష‌న్ డైరెక్ట‌ర్ల ఎఫెక్ట్… ఇవన్నీ ఈ సినిమాలో క‌నిపిస్తున్నాయి. రికార్డులు బ‌ద్దలు కావ‌డ‌మే మిగిలిందిక‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

10 COMMENTS

    • ఎంగిలిమెతుకులకోసం కొన్ని కంచర గాడిదలు మెరుగుతూ ఉంటాయి వాటిని మనం పట్టించుకో అవసరం లెదు బ్రో వాటికీ నీతి జాతి అనేది ఏమి ఉండదు

     • Orey adukuthine kula gajji chow kukka me edupu antha ntr medha kadara ekkada me pappu gadi ke g lo rod dimputadamonani Atu mega valla me ku kapulu g lo rod already petaru ra me kamma batch ke lanja Kodaka

     • అర్థం అయినది నువ్ ఒక సమాజిక వర్గం మిద పడి ఇంతలా ఎడుస్తున్నావ్ అంటే నువ్ వాళ్ళ చేతుల్లో చావ్ దెబ్బల తిని అయి ఉండాలి లేకపొతే ని పుట్టుకతో వాళ్ళ ప్రమేయం అయిన ఉండాలి ..నీలంటి జఫ్ఫా ఏడుస్తూనే ఉంటరు వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు

Comments are closed.