నెలా 9రోజుల్లో అనుష్కా అందాలు…

బాహుబలి పార్ట్ 1 సినిమాలో అనుష్కా అభిమానులు చాలానే నిరుత్సాహపడ్డారు. ఎందుకంటే ఆ సినిమాలో కథ ప్రకారం నడివయసు పాత్రను అనుష్కా పోషించాల్సివచ్చింది. బాహుబలి చివరిభాగంలో మాత్రం తన అందాలను అనుష్కా ఆరబోయబోతోంది. అయితే, `ఈ ఆనందాన్ని సొంతం చేసుకోవాలంటే, 2016వరకు ఆగాల్సిందేనేనా’ అంటూ అభిమానులు నిరుత్సాహపడుతున్నమాట వాస్తవం. అక్కర్లేదు… ఎందుకంటే, ఈలోగానే ఇంచుమించు బాహుబలిలోని సాంకేతిక హంగులతోనే వస్తున్న `రుద్రమదేవి’ వారి కోరికను ఈడేర్చబోతున్నది. `రుద్రమదేవి’ సినిమాను అక్టోబర్ 9న అభిమానులు చూడబోతున్నారు. ఇవ్వాళ ఆగస్టు 31… అంటే ఇక నెలా9రోజులు ఆగితే చాలన్నమాట.

భారీసెట్టింగ్స్, సాంకేతిక పరిజ్ఞానం, విజువల్ ఎఫెక్ట్స్, చారిత్రాత్మక కథావస్తువు వంటివిషయాల్లో బాహుబలి-2 కి రుద్రమదేవి సినిమాకు పోలికలున్నాయి. పైగా ఈ రెండు సినిమాల్లోనూ అనుష్క పౌరుషంఉట్టిపడే వీరవనితగానే కనబడటం, మరో పక్క అందాలు ఆరబోసే శృంగారదేవతగానూ దర్శనమివ్వడం అభిమానులకు పంటపండినట్టే అవుతుంది. ముందుగా రిలీజ్ అయ్యే రుద్రమదేవి, ఆ తర్వాత వచ్చే బాహుబలి -2 చిత్రాలు అనుష్కా కెరీర్ లో ఆణిముత్యాలుగా నిలుస్తాయని ఆమె అభిమానులు అంటున్నారు.

గుణశేఖర దర్శకత్వంలో రెడీఅయిన రుద్రమదేవి సినిమాని అక్టోబర్ 9 (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయడానికి సన్నాహాలుచేస్తున్నారు. ఈ చిత్రానికి అభిషేక్ నామా నిర్మాతగా ఉన్నారు. 60కోట్ల రూపాయల బడ్జెట్ తో రుద్రమదేవిని తెరకెక్కించారు. త్రీడి ఎఫెక్ట్ తో తీసిన సినిమా ఇది. సరికొత్త సాంకేతిక విలువలున్న సినిమాకావడంతో ప్రేక్షకులు రిలీజింగ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారని గుణశేఖర అంటున్నారు. బాహుబలికి ఎంతటి ఆదరణవచ్చిందో, అదే మోస్తరు సాంకేతిక విలువలు, కథాబలమున్న రుద్రమదేవి చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నిర్మాణబృందం విశ్వసిస్తోంది.

రుద్రమదేవిలో అనుష్కాతోపాటుగా అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, విక్రంజీత్, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు, నిత్యామీనన్ వంటివారు నటించారు. ఇళయరాజ సంగీతం సమకూర్చారు. నీతా లుల్లా నాటి కాకతీయ కాలంనాటి దుస్తులను తయారుచేశారు.

మూడవ శతాబ్దికాలంనాటి కాకతీయ సామ్రాజ్యంనాటి కథావస్తువుతో తీసిన రుద్రమదేవి తెలుగుతోపాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలఅవుతుంది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close